ఈ పండ్లను, కూరగాయలను తింటే మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది.. గుండెజబ్బులు కూడా రావు..!

First Published | Oct 21, 2023, 11:25 AM IST

మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు మన గుండె ఆరోగ్యం బాగుండాలి. గుండె కొట్టుకున్నంత వరకే మనం ప్రాణాలతో ఉండేది. అందుకే గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కానీ ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు, గుండెపోటుతో బాధపడేవారు ఎక్కువయ్యారు. ఎంతో మంది గుండెపోటుతో ఉన్నపాటుగా చనిపోతున్నారు. మన గుండె బలంగా ఉండాలంటే కొన్ని పండ్లను, కూరగాయలను తినాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఇవి గుండెజబ్బులొచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తాయట.

heart health

ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసులోనే గుండె జబ్బులొస్తున్నాయి. గుండెపోటు బారిన పడుతన్నారు. దీనికి ప్రధాన కారణం తప్పుడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలేనంటున్నారు నిపుణులు. బిజీ లైఫ్ స్టైల్ వల్ల శారీరక శ్రమలో పాల్గొనే టైం కూడా లేని వారున్నారు. కానీ నిశ్చల జీవనశైలి మనల్ని ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. 

foods for heart

అయితే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల మనల్ని ఎన్నో రోగాల ముప్పు నుంచి కాపాడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే గుండె సంబంధిత వ్యాధులను తగ్గించడానికి మన రోజువారి ఆహారంలో కొన్ని పండ్లను, కూరగాయలను చేర్చుకోవాలంటున్నారు నిపుణులు. మరి మన గుండె పదిలంగా ఉండటానికి ఎలాంటి పండ్లను, కూరగాయలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 


బెర్రీలు

బెర్రీల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఈ పండ్లు మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న బెర్రీలను తింటే గుండెజబ్బులొచ్చే ప్రమాదం తప్పుతుందని నిపుణులు అంటున్నారు. ఈ పండ్లలో ఫైబర్, ఫోలేట్, ఐరన్, కాల్షియం వంటి మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బెర్రీలలో కొవ్వు పరిమాణం తక్కువగా ఉంటుంది. వీటిని తింటే బరువు పెరుగుతారన్న భయం కూడా అక్కర్లేదు. వీటిని రెగ్యులర్ గా తింటే గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చు. 
 

బ్రోకలీ

పోషకాలు పుష్కలంగా ఉండే బ్రోకలీ కూడా మన గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బ్రోకలీని రెగ్యులర్ గా తినొచ్చు. ఇందుకోసం మీరు ఉడకబెట్టిన బ్రోకలీని మీ రోజువారి ఆహారంలో చేర్చుకోవచ్చు. అలాగే సలాడ్లలో కూడా బ్రోకలీని చేర్చుకోవచ్చు. ఈ కూరగాయ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీకు గుండెజబ్బుల ముప్పు తప్పుతుంది. 

బచ్చలికూర

బచ్చలికూర మంచి పోషకాలున్న ఆకు కూరగాయ. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. అంతేకాదు ఈ ఆకుకూర మన గుండెను ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచేందుకు కూడా సహాయపడుతుంది. ఆకు కూరల్లో విటమిన్ సి, కాల్షియం, విటమిన్ బి6, మెగ్నీషియం, ఐరన్ వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. బచ్చలికూరను ఎన్నో విధాలుగా తినొచ్చు. సూప్ లేదా జ్యూస్ రూపంలో కూడా దీన్ని తీసుకోవచ్చు. లేదాఉడికించి కూరగాయగా చేసుకుని కూడా తినొచ్చు.
 

టమాటాలు

మనం చేసే ప్రతి వంటలో ఖచ్చితంగా టమాటాలు ఉంటాయి. వీటిని ప్రతి కూరలో ఉపయోగించడానికి రీజన్ లేకపోలేదు. ఇవి వంటల టేస్ట్ ను పెంచుతాయి. ఈ విషయం అందరికీ తెలుసు. కానీ టమాటాలు కూడా మన ఆరోగ్యానికి ఎన్నో విధాలు మేలు చేస్తాయి. వీటిలో పొటాషియం, ఫైబర్, విటమిన్-సి, ఫోలేట్ తో పాటుగా ఎన్నో రకాల పోషకాలుంటాయి. ఇవి మన గుండె ను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల నుంచి మనల్ని రక్షించడానికి సహాయపడుతుంది. వెల్లుల్లిని తినడం వల్ల శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి. దీంతో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 
 

Latest Videos

click me!