మీకు ఆస్తమా ఉందా? అయితే వీటిని ఖచ్చితంగా తినండి

First Published | Oct 20, 2023, 2:42 PM IST

ప్రతి ఏడాది ఉబ్బసం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది చనిపోతున్నారు. ఈ వ్యాధి వల్ల సరిగ్గా శ్వాస తీసుకోవడానికి రాదు. చాలాసార్లు శ్వాస తీసుకునేటప్పుడు ఈల శబ్దం కూడా వస్తుంటుంది. ఈ సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే మీరు కొన్ని రకాల ఆహారాలను తినాలంటున్నారు నిపుణులు. అవేంటంటే? 
 

ఆస్తమా వ్యాధి రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఈ వ్యాధిలో గుండె, ఊపిరితిత్తులు చాలా ప్రభావితమవుతాయి. చలికాలంలో ఆస్తమా సమస్య మరింత పెరుగుతుంది. ఆస్తమా సమస్య వల్ల రోగి గొంతులో ఎప్పుడూ శ్లేష్మం ఉంటుంది. దీని వల్ల రోగి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడతాడు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆస్తమా పేషెంట్లు ఇన్హేలర్లు లేదా మందులను ఎప్పుడూ తమవద్దే ఉంచుకోవాల్సి ఉంటుంంది. అలాగే కొన్ని రకాల ఆహారాలు కూడా ఆస్తమా పేషెంట్లకు మేలుచేస్తాయంటున్నారు నిపుణులు. వీటిని తింటే ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందుకోసం ఏమేం తినాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బచ్చలికూర

ఆస్తమా పేషెంట్లకు బచ్చలికూర ఎంతో మేలు చేస్తుంది. వాస్తవానికి ఆస్తమా పేషెంట్ల శరీరంలో పొటాషియం, మెగ్నీషియం తక్కువగా ఉంటుంది. కాగా ఉబ్బసం సమస్య ఉన్నవారు పోషకాలు పుష్కలంగా ఉండే బచ్చలికూరను తమ రోజువారి ఆహారంలో భాగం చేసుకోవచ్చు. ఇది ఉబ్బసం లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
 


నారింజ

నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. అలాగే ఇది ఆస్తమా సమస్య నుంచి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఒక పరిశోధన ప్రకారం.. విటమిన్-సి ఎక్కువగా తీసుకునేవారికి ఉబ్బసం వచ్చే అవకాశం చాలా తక్కువ.
 

Bananas

అరటి

ఆస్తమా రోగులకు అరటిపండు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  పొటాషియం పుష్కలంగా ఉండే ఈ పండును తింటే ఆస్తమా సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాదు అధిక రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది.
 

Avocado

అవొకాడో

అవొకాడోలు యాంటీ ఆక్సిడెంట్లకు మంచి వనరు. అవొకాడోలను తింటే శరీరంలోని విష పదార్థాలు బయటకు తొలగిపోతాయి. అవొకాడోలు ఉబ్బసం రోగులకు చాలా సహాయపడుతాయి. అందుకే ఈ పండును ఆస్తమా పేషెంట్లు తమ ఆహారంలో చేర్చుకోవచ్చు. 

అల్లం

అల్లం ఎన్నో ఔషదగుణాలకు మంచి మూలం. ఇది ఫుడ్ రుచిని పెంచడంతో పాటుగా మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆస్తమా రోగులకు ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అల్లం గొంతును ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తుంది. దీని కోసం అల్లం తురిమి వేడి నీటిలో మిక్స్ చేయాలి. తర్వాత దీనిలో ఒక టేబుల్ స్పూన్ తేనెను కలిపి తాగాలి. ఇది మీకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. 

Latest Videos

click me!