సాధారణంగా కూరగాయలు, ఇతర ఆహార పదార్థాలను ఎక్కువ రోజులు ఫ్రెష్ గా ఉంచడానికి మనం వాటిని ఫ్రిజ్ లో పెడుతుంటాం. కానీ నిమ్మకాయ లాంటివి ఫ్రిజ్ లో పెడితే గట్టిగా అయిపోతాయి. మరి నిమ్మకాయలను ఫ్రిజ్ లో స్టోర్ చేయొచ్చా? చేస్తే ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఫుడ్, ఇతర పదార్థాలు ఎక్కువ కాలం నిల్వ చేయడానికి ఫ్రిజ్ చాలా మంచి మార్గం. కానీ ప్రతిదాన్ని ఫ్రిజ్‌లో పెట్టి చాలారోజుల వరకు తాజాగా ఉంచలేము. సాధారణంగా చాలామంది నిమ్మకాయలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచడానికి ఫ్రిజ్‌లో పెడతారు. కానీ నిమ్మకాయను ఫ్రిజ్‌లో పెట్టడం కరెక్టేనా? నిమ్మకాయను నిల్వ చేసే సరైన పద్ధతి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
25
నిమ్మకాయలు ఫ్రిజ్ లో పెట్టచ్చా?
నిమ్మకాయల్ని ఫ్రిజ్‌లో పెడితే గట్టిగా అవుతాయి. రసం కూడా తగ్గుతుంది. సిట్రిక్ యాసిడ్ ఉండే పండ్లకు తక్కువ టెంపరేచర్ అస్సలు సూట్ కాదు. దానివల్ల రుచి కూడా మారిపోతుంది. మరి నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉండాలంటే ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.
35
ప్లాస్టిక్ కవర్..
నిమ్మకాయలను నేరుగా ఫ్రిజ్ లో పెట్టకుండా ప్లాస్టిక్ సంచిలో వేసి అప్పుడు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఇలా స్టోర్ చేస్తే నిమ్మకాయలు ఎక్కువ రోజులు ఫ్రెష్‌గా ఉంటాయి.
45
డబ్బాలో నీళ్లు పోసి..
నిమ్మకాయలను ఒక డబ్బాలో పోసి అవి మునిగేలా నీళ్లు పోయాలి. ఆ తర్వాత ఆ డబ్బాను ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా నిమ్మకాయలు చాలా రోజుల పాటు ఫ్రెష్ గా ఉంటాయి.
55
నిమ్మకాయలకు నూనె రాసి..
నిమ్మకాయల్ని నిల్వ చేయడానికి మరో మార్గం వాటికి నూనె రాయడం. నిమ్మకాయలకు కొంచెం నూనె రాసి ఒక గిన్నెలో పెడితే పాడవకుండా ఉంటాయట.