World Lizard Day 2023
ఎంత జాగ్రత్తగా ఉన్నా.. తినే ఆహారంలో కీటకాలు పడటం సహజం. వండేటప్పుడు కాని.. తినేటప్పుడు కాని.. పైనుంచి కీటకాలు, బల్లులు పడటం సహజంగా జరుగుతుంటుంది. అయితే తినే ఆహారంలో బల్లి అంటే ఎవరికైనా భయం వేస్తుంది. బల్లిని చూస్తేనే అసహ్యించుకునే వారుఉన్నారు. అటువంటిది తినే ఆహారంలో బల్లి పడితే వెంటనే పక్కన పెట్టేస్తుంటారు.
lizard
బల్లి పడితే ఆహారం విషంగా మారుతుందా..? బల్లి ఎంగిలి చేస్తే..ఆ ఆహారం విషపూరితం అవుతుందా..? ఈ విషయంలో రకరకాల వాదనలు వినిపిస్తుంటాయి. సాధారణంగా కీటకాలు రెండు రకాలుగా ఉంటాయి. అందులో కొన్ని రకాలు విషపూరితమైనవి.. మరికొన్ని రకాలు విషపూరితం కానివి.
Lizard at home
విషపూరితమైన కీటకాలు ఆహారంలోకి ప్రవేశిస్తే అది దేహానికి భౌతికంగా నష్టం కలిగించే అవకాశం ఉంది. బహుశా, ఏదైనా విషపూరితమైన కీటకం ఆహారంలో పడితే, మీరు ఆ ఆహారాన్ని తింటే మీరు తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాని కొన్ని సార్లు సాధారణ పురుగులు ఆహారంలో పడితే పెద్దగా పట్టించికోరు.. తీసి పక్కన పడేస్తుంటారు.
చాలా మందికి బల్లులంటే అస్యం ఉంటుంది. వాటిని దగ్గరకు రావివ్వరు.. అయితే బల్లలు మన చుట్టుపక్కల ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే బల్లులు ఎటువంటి విషాన్ని కలిగి ఉండవు. మన చుట్టూ ఉండే సాధారణ బల్లుల్లో ఎటువంటి విషయం ఉండదు. కాని బల్లి పడిన ఆహారం తింటే ఎందుకు అనారోగ్యం వస్తుంది అంటే..
బల్లులు ఆహారంలో పడినప్పుడు అవి మూత్రవిసర్జన లేదా మలవిసర్జన చేసే అవకాశం ఉంది. ఈ మూత్రం మరియు మలం విషపూరితం కానప్పటికీ, అవి కొంతమందిలో అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయి. అలాగే, కొన్నిసార్లు వాంతులు మరియు మూర్ఛలు సంభవిస్తాయి. అంతే కాని వాటిలో ఎటువంటి విషయం ఉండదు.
బల్లులు ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటాయి. మరుగుదొడ్లు వంటి అపరిశుభ్రమైన ప్రదేశాలలో కూడా కనిపిస్తాయి. వాటి పాదాలు, చర్మంపై కంటికి కనిపించని అనేక సూక్ష్మక్రిములను కలిగి ఉంటాయి. బల్లి ఆహారంలోకి ప్రవేశించినప్పుడు, ఈ క్రిములు ఆహారంలో కలిసిపోతాయి మరియు ఆహారం చెడిపోతుంది. ఈ విషయం తెలియకుండా ఆహారం తీసుకోవడం వల్ల వాంతులు, స్పృహ తప్పడం వంటివి జరుగుతుంటాయి. దానిని పుడ్ పాయిజన్ గా పరిగణిస్తుంటారు. అందుకే బల్లులతో కాస్త జాగ్రత్తగా ఉండండి.