దాదాపు అందరి కిచెన్ లో ఉండే మసాలా దినుసు లవంగం. దీనిని మనం మసాలా కూరల్లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. రుచికి మాత్రమే వాడే ఈ లవంగం.. ఆయుర్వేదం ప్రకారం మీ బరువు కూడా తగ్గిస్తుందని మీకు తెలుసా? అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆయుర్వేదం ప్రకారం లవంగాల్లో ఒక ప్రత్యేకమైన మెడిసిన్ ప్రాపర్టీలు ఉంటాయి. ఈ లవంగాన్ని వాడే విధంగా వాడితే.. మన మెటబాలిజం ని మెరుగుపరుస్తుందట. అంతేకుండా.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. లవంగంలో చాలా రకాల న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందులో మాంగనీస్, విటమిన్ కే, ఫైబర్ లాంటివి కూడా ఉన్నాయి. ఈ లవంగం తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు రావు, బ్యాక్టీరియా నిర్మూలన, నోటి ఆరోగ్యాన్ని కాపడటంలోనూ సహాయం చేస్తుంది. ఇప్పుడు ఇదే లవంగంతో బరువు ఎలా తగ్గించవచ్చో చూద్దాం..
1.లవంగం నీరు..
ముందుగా కొన్ని లవంగాలను తీసుకొని వాటిని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. రాత్రంతా ఈ లవంగాలను ఆ నీటిలో నానే వరకు ఆగాలి. ఉదయాన్నే ఈ నీటిని తాగితే సరిపోతుంది. ఈ నీటిని తాగడం వల్ల.. మనకు రోజంతా బాడీ హైడ్రేటెడ్ గా ఉన్న అనుభూతి కలుగుతుంది. మెటబాలిజం మెరుగుపరుస్తుంది. ఈజీగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
2.లవంగం టీ..
లవంగం టీ తాగడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గొచ్చు. దాని కోసం మీరు.. కొన్ని లవంగాలను తీసుకొని నీటిలో వేయాలి. ఇప్పుడు ఆ నీటిలో వేసిన లవంగాలను టీ మరిగించినట్లుగా 5 నుంచి 10 నిమిషాల పాటు మరిగించాలి. తర్వాత వడ కట్టుకొని తాగేయడమే. ఈ లవంగం టీ తాగడం వల్ల... అరుగుదల సమస్యలు తగ్గుతాయి. మెటబాలిజం మెరుగుపడుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.
3.లవంగం పొడి..
లవంగాలను పొడిగా చేసి దానిని చాల రాకల వంటల్లో ఉపయోగించవచ్చు. మీరు తాగే సూప్స్, లేదంటే ఏదైనా కర్రీలలో కూడా దీనిని కలుపుకోచవ్చు. ఇలా దీనిని కలుపుకొని తీసుకోవడం వల్ల.. మనకు చాలా సంతృప్తిగానూ ఉంటుంది. బరువు తగ్గేందుకు సహాయపడుతుంది.
clove
4.స్మూతీస్..
మనలో చాలా మందికి స్మూతీస్ తాగే అలవాటుు ఉంటే ఉంటుంది. అయితే.. ఈసారి స్మూతీస్ తాగేటప్పుడు.. దానిలో కూడా లవంగం పొడిని వేసుకొని తాగితే రుచి బాగుంటుంది. ఆరోగ్యానికీ, బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది.
clove
5.లవంగం నూనె..
లవంగాలతో నూనె తయారు చేయడం కాదు.. మీరు వంటకు ఏ నూనె ఉపయోగిస్తే.. ఆనూనెలో కొద్దిగా లవంగాలు వేసి వేడి చేయాలి.. ఆ నూనెను మీ వంట నూనెలో కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనెలను వంటలో ఉపయోగించడం వల్ల కూడా బరువు ఈజీగా తగ్గచ్చు. ఇంకెందుకు ఆలస్యం... ఇలా లవంగం ని పలు రకాలుగా వాడి.. మీ బరువు తగ్గించుకునే ప్రయత్నం చేయండి.