ఇడ్లీ, దోశ Vs ఓట్స్: బ్రేక్ ఫాస్ట్ కి ఏది బెస్ట్..? ఏది తింటే బరువు తగ్గుతారు?

Published : Nov 20, 2025, 10:04 AM IST

ఇడ్లీ, దోశ Vs ఓట్స్:  బరువు తగ్గడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారా? అసలు.. ప్రతిరోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో ఏం తింటే బరువు తగ్గుతారో తెలియడం లేదా?  అయితే.. ఇది చదవాల్సిందే.

PREV
15
Breakfast

బ్రేక్ ఫాస్ట్ అంటే మన రోజు మొత్తం ఎనర్జీని సెట్ చేసే మీల్. అందుకే, తేలికగా ఉండటంతో పాటు, శరీరానికి అవసరమైన పోషకాలు అందించే ఆహారం ఎంచుకోవాలి. మన దక్షిణ భారతీయులు ఎక్కువగా ఇడ్లీ, దోశ లాంటి వాటిని బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటారు. వీటి రుచి అద్భుతంగా ఉంటుంది. కానీ, ఇవి తింటే బరువు తగ్గమని.. చాలా మంది ఓట్స్ తింటారు. నిజంగానే ఓట్స్ తింటే బరువు తగ్గుతారా? నిజానికి ఈ ఇడ్లీ, దోశ, ఓట్స్ కేలరీల్లో పెద్ద తేడా లేదు. మరి.. బరువు తగ్గడంలో ఓట్స్ ఎలా హెల్ప్ చేస్తాయి. అసలు.. ఈ మూడింటిలో... ఆరోగ్యకరమైన బ్రేక్ ఫాస్ట్ ఏంటి? నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం....

25
1.ఇడ్లీ...

నిజానికి ఇడ్లీ చాలా ఆరోగ్యకరమైనదని చెప్పొచ్చు. వీటిని మనం ఆవిరితో ఉడికిస్తూ ఉంటాం. దీనిని తయారు చేయడానికి నూనె వాడం. చాలా మృదువుగా ఉంటుంది. చాలా సులభంగా జీర్ణం అవుతుంది. అయితే.. వీటిని ఎక్కువగా బియ్యంతో తయారు చేస్తారు. కాబట్టి... కార్బో హైడ్రేట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్, ఫైబర్ చాలా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఇడ్లీ తినడం వల్ల ఎనర్జీ వస్తుంది కానీ.. బరువు తగ్గడానికి హెల్ప్ అవ్వదు. అంతేకాకుండా.. ఈజీగా జీర్ణం అవ్వడం వల్ల తక్కువ సమాయానికే ఆకలి వేస్తుంది. గట్ హెల్త్ కి మాత్రం చాలా బాగా సహాయపడుతుంది.

బరువు తగ్గాలంటే ఇడ్లీ ఎలా తినాలి?

మీరు ఇడ్లీ తిని బరువు తగ్గాలి అంటే... మీడియం సైజు ఇడ్లీలు రెండు కంటే ఎక్కువగా తినకూడదు. పల్లీ, కొబ్బరి చట్నీలకు బదులు సాంబార్ తో తినడం బెటర్. సాంబార్ లో కూరగాయ ముక్కలు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం బెటర్.

35
2.దోశ...

దోశ చాలా రుచికరమైన బ్రేక్ ఫాస్ట్. దోశ వేసేటప్పుడు కచ్చితంగా నూనె వాడతాం. ఇక.. దోశ పిండి కోసం కచ్చితంగా బియ్యం వాడతారు. కాబట్టి... ఇందులో కేలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి... బరువు తగ్గడానికి పెద్దగా ఉపయోగపడకపోవచ్చు.

బరువు తగ్గాలంటే దోశ ఎలా తినాలి?

బరువు తగ్గాలి అనుకునేవారు దోశను చాలా రేర్ గా మాత్రమే తినాలి. నార్మల్ దోశకు బదులు ఓట్స్ దోశ , రాగి దోశ, పెసరట్టు లాంటివి తినడం మంచిది. అవి కూడా తక్కువ నూనెతో వేసుకోవడం మంచిది.

45
3.ఓట్స్...

బరువు తగ్గాలి అనుకునే వారికి ఓట్స్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీటిని తిన్నప్పుడు ఎక్కువ సేపు ఆకలి వేయదు. వేరే ఫుడ్స్ తినాలనే కోరిక కూడా కలగదు. కేలరీలు తక్కువగా ఉంటాయి. గ్లెసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంటుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అందుకే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది.

బరువు తగ్గడానికి ఓట్స్ ఎలా తినాలి?

ఓట్స్ + వెజిటేబుల్స్ (ఉల్లిపాయ, క్యారెట్, పాలకూర) తో ఉప్మా

ఓట్స్ + మజ్జిగ/కర్డ్

ఓట్స్ దోశ లేదా ఓట్స్ ఇడ్లీ కూడా మంచి ఆప్షన్

చక్కెర వాడకూడదు

రెగ్యులర్ గా ఉదయం తింటే 2–3 వారాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది

55
బరువు తగ్గడానికి బ్రేక్ ఫాస్ట్ ఎలా తినాలి..?

మనం బరువు తగ్గాలి అంటే ఎంచుకునే ఆహారం విషయంలో కొన్ని రూల్స్ కచ్చితంగా పాటించాలి. ముఖ్యంగా ఎక్కువ ఫైబర్, ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. బియ్యం ఎక్కువగా ఉండే పదార్థాలను కాస్త తగ్గించాలి. ఈ రూల్స్ ఫాలో అయితే.... చాలా ఈజీగా బరువు తగ్గగలరు.

Read more Photos on
click me!

Recommended Stories