Fake Mango: మామిడి పండు సహజంగా పండిందో లేదో తెలుసుకునేదెలా?
మీరు కొనే మామిడి పండు సహజంగా పండిందా లేక.. కెమికల్స్ తో పండించారో తెలుసుకోలేకపోతున్నారా? ఈ ట్రిక్స్ తో తెలుసుకోవచ్చు.
మీరు కొనే మామిడి పండు సహజంగా పండిందా లేక.. కెమికల్స్ తో పండించారో తెలుసుకోలేకపోతున్నారా? ఈ ట్రిక్స్ తో తెలుసుకోవచ్చు.
How to Identify Artificially Ripened Mangoes : వేసవి కాలం వచ్చిందంటే అందరికీ మొదట గుర్తుకు వచ్చేది మామిడి పండు. ఎందుకంటే ఈ సీజన్‌లో మాత్రమే రుచికరమైన , వివిధ రకాల మామిడి పండ్లు లభిస్తాయి. మామిడి పండ్ల సీజన్ ప్రారంభమైందంటే చాలు మార్కెట్‌లో రకరకాల మామిడి పండ్లు అమ్మకానికి వస్తాయి. నిజానికి మామిడి పండ్లు తినడానికి చాలా రుచిగా ఉంటాయి. కానీ ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, సహజంగా పండిన మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండిన మామిడి పండ్లే ఎక్కువగా లభిస్తాయి. ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలను ఉపయోగించి కృత్రిమ మామిడి పండ్లను తయారు చేస్తారు. వీటిని తింటే చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి.
ఇటువంటి పరిస్థితుల్లో మీరు సహజంగా పండిన మామిడి పండు తింటున్నారో లేదో నకిలీ మామిడి పండు తింటున్నారో తెలియక ఆందోళన చెందుతున్నారా? నకిలీ మామిడి పండును గుర్తించడానికి సహాయపడే కొన్ని మార్గాలు ఉన్నాయి.. కాబట్టి ఈ సంవత్సరం మామిడి పండ్ల సీజన్‌లో మామిడి పండు కొనే ముందు ఈ చిట్కాలు తెలుసుకోండి.
మామిడి పండ్లను కొనుగోలు చేసిన వెంటనే ఒక బకెట్‌లో నీటిని నింపి అందులో మామిడి పండ్లను వేయండి. మామిడి పండ్లు మునిగితే అది సహజంగా పండించిన పండు. అదే మామిడి పండ్లు మునగకుండా తేలుతూ ఉంటే అది కృత్రిమ పద్ధతిలో పండించిన పండు.
మామిడి పండు తొక్క రంగు:
కృత్రిమంగా పండిన మామిడి పండ్లు ఒకే రంగులో ఉంటాయి. అదే సహజంగా పండించిన మామిడి పండ్లు కాస్త పసుపు లేదా నారింజ రంగులో కనిపిస్తాయి. అంతేకాకుండా అవి కొంచెం మెరిసేలా కూడా ఉంటాయి.
సహజంగా పండిన మామిడి పండ్లు ఒక విధమైన తీపి , పండు వాసనను కలిగి ఉంటాయి. అదే కృత్రిమంగా పండించిన మామిడి పండ్లలో రసాయనం లేదా విభిన్నమైన వాసన వస్తుంది.
పండు స్వభావం:
సహజంగా పండిన మామిడి పండ్ల కంటే కృత్రిమంగా పండిన మామిడి పండ్లు చాలా మృదువుగా , సున్నితంగా ఉంటాయి. ఎందుకంటే కృత్రిమ పద్ధతిలో పండించేటప్పుడు దాని ప్రక్రియలో ఉపయోగించే రసాయనాలు పండును విచ్ఛిన్నం చేస్తాయి. దీని కారణంగానే అది మృదువుగా మారుతుంది.
బేకింగ్ సోడా:
ఒక బకెట్‌లో నీటిని నింపి అందులో మామిడి పండ్లను వేయండి. కొద్దిగా బేకింగ్ సోడాను కూడా నీటిలో వేసి 15 నిమిషాల తర్వాత మామిడి పండ్లను కడిగి చూడండి. దాని రంగు మారితే అది రసాయనం కలిపిన మామిడి పండు అని అర్థం.