పిండి వేడెక్కితే దాని రుచి మారిపోతుంది, తొందరగా పులిసిపోయే ప్రమాదం ఉంది. ఐస్ క్యూబ్స్ వాడటం వల్ల పిండి అసలు రుచి, తెలుపు రంగు అస్సలు మారకుండా ఉంటాయి. పిండి రుబ్బేటప్పుడే వేడెక్కితే, అప్పుడే పులియడం (ఫర్మెంటేషన్) మొదలవుతుంది. దీనివల్ల పిండి సరిగ్గా పొంగదు. అదే ఐస్ క్యూబ్స్ వేస్తే, పిండి నెమ్మదిగా పులిసి, చక్కగా పొంగుతుంది.
చల్లటి నీళ్లు లేదా ఐస్ క్యూబ్స్ వేసి రుబ్బితే బియ్యం, పప్పులు తొందరగా మెత్తగా నలుగుతాయి. ఐస్ క్యూబ్స్ నీటిని అందిస్తూ, పిండి కన్సిస్టెన్సీని కాపాడతాయి. ఈ చిట్కా వాడితే.. ఎండాకాలంలో మీకు పిండి పులిచే సమస్య ఉండదు.