Ice Cream Storage: చాలా మంది ఐస్ క్రీం డబ్బాలు, డబ్బాలు తెచ్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తింటూ ఉంటారు. తినాలనిపించినప్పుడల్లా కొంచెం కొంచెం తీసుకుని తింటారు. కొందరు నెలలతరబడి ఉంచేస్తారు. అసలు ఐస్ క్రీం ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజులు ఉంటే సేఫ్?
ఫ్రిడ్జ్, ఫీజర్ లో ఎన్ని రోజులు ఆహారం ఉన్నా ఏం కాదని చాలా మంది అనుకుంటారు. అది కేవలం అపోహ మాత్రమే. ఒకటి, రెండు రోజులకు మాత్రమే ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం మంచిది. వీలైతే ఫ్రిడ్జ్ లో పెట్టకపోవడం మరీ మంచిది. కానీ ఐస్ క్రీమ్స్ లాంటివి ఫ్రిడ్జ్ లోనే ఉంచాలి. అందుకని కొందరు నెలల తరబడి ఫ్రిడ్జ్ లో ఐస్ క్రీమ్స్ పెట్టుకుని తింటారు. డబ్బాలు డబ్బాలు తెచ్చిపెట్టుకుని నిల్వ చేసుకుంటారు. అలా చేయడం అసలు మంచిది కాదు. ప్రతి దానికి ఒక ఎక్స్ పైరీ ఉంటుంది. ఐస్‌క్రీమ్ కూడా పాడవుతుంది. సరైన పద్ధతిలో నిల్వ చేయకపోతే, దాని నుంచి వాసన రావడం మొదలవుతుంది. అందుకే ఐస్‌క్రీమ్‌ను ఫ్రీజర్‌లో ఎలా పెట్టాలో, ఎన్ని రోజులు ఉంచాలో కూడా తెలుసుకోవాలి.
24
ఐస్‌క్రీమ్ ఎంతకాలం సురక్షితం?
ఐస్‌క్రీమ్ ప్యాక్ ఓపెన్ చేయకపోతే, దాన్ని ఒకటి నుంచి రెండు నెలల వరకు ఫ్రీజర్‌లో పెట్టొచ్చు. ప్యాకేజీపై ఉన్న ఎక్స్ పైరీ డేట్ చెక్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఒకవేళ మీరు ప్యాక్ ఓపెన్ చేస్తే మాత్రం, ఏడు నుంచి పది రోజుల్లో తినేయాలి. అప్పటివరకే ఐస్‌క్రీమ్ తాజాగా ఉంటుంది. లేదంటే త్వరగా కరిగిపోవడం, నీరు పట్టేయడం లాంటివి జరిగే అవకాశం ఉంది.
34
ఐస్‌క్రీమ్ పాడైందని ఇలా గుర్తించండి
ఐస్‌క్రీమ్‌ను ఎప్పుడూ చల్లటి ఉష్ణోగ్రతలో ఉంచాలి. టెంపరేచర్ పెరిగితే ఐస్‌క్రీమ్ త్వరగా పాడవుతుంది. ఐస్‌క్రీమ్ రుచి మారినా, దానిపై మంచు గడ్డలు ఏర్పడినా, లేదా ఫ్రీజర్ వాసన వస్తున్నా.. మీ ఐస్‌క్రీమ్ పాడైపోయినట్లే. అలా ఉంటే అస్సలు తినకండి.
ఇష్టపడి కొన్న ఐస్‌క్రీమ్ ఎక్కువ రోజులు రావాలంటే, దాన్ని సరైన పద్ధతిలో స్టోర్ చేయాలి. గాలి చొరబడని డబ్బాలో ఐస్‌క్రీమ్ పెట్టండి. మూత గట్టిగా ఉండేలా చూసుకోండి. ఐస్‌క్రీమ్ బాక్స్‌ను, ఫ్రీజర్‌ను పదేపదే తెరవొద్దు. ఐస్‌క్రీమ్ పైన బట్టర్ పేపర్ ఉంచడం వల్ల గాలి తగలకుండా గట్టిగా ఉండేలా చేస్తుంది.