Instant Curd: ఇంట్లో పెరుగు అయిపోయిందా? 15 నిమిషాల్లో పాలను పెరుగులా మార్చే టెక్నిక్ ఇది

Published : May 30, 2026, 12:56 PM IST

Instant Curd:  ఇంట్లో సడెన్ గా పెరుగు అయిపోతే మీరు ఏం చేస్తారు..? చాలా మంది  బయట మార్కెట్లో  పెరుగు కొని దానిని తింటారు. కానీ,  చాలా మంది  బయటి పెరుగు నచ్చదు. అలాంటివారి కోసమే ఈ చిట్కా… ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో చిక్కటి పెరుగు తయారు చేయచ్చు.. 

PREV
13
ఇంట్లో సడెన్ గా పెరుగు అయిపోయిందా?

మన తెలుగు ప్రజలకు పెరుగు లేనిదే భోజనమే పూర్తి అవ్వదు. చాలా మందికి ఎన్ని రకాల వంటలు ఉన్నా.. చివరలో కచ్చితంగా పెరుగు కావాల్సిందే. అందుకే, దాదాపు అందరూ ఇంట్లోనే పెరుగు తయారు చేసుకుంటూ ఉంటారు. కానీ ఒక్కోసారి ఇంట్లో పెరుగు అయిపోవడమో.. లేక పాలు తోడు వేయడమో మర్చిపోతూ ఉంటారు. అలాంటివారు  కంగారు పడకుండా.. బయట మార్కెట్లో పెరుగు కొనాల్సిన అవసరం లేకుండా.. కేవలం 15 నిమిషాల్లో చిక్కగా, కమ్మని గడ్డ పెరుగు తయారు చేయచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం…

23
15 నిమిషాల్లో పెరుగు తయారీ...

ముందుగా పాలను బాగా మరిగించాలి.  పాలు మరిగిన తర్వాత, మంట తగ్గించి 2 నుంచి 3 నిమిషాలు సిమ్ లో ఉంచాలి.  తర్వాత పాలను  స్టవ్ మీద నుంచి దించి, గోరువెచ్చగా అయ్యే వరకు చల్లారనివ్వాలి. ఇలా చేయడం వల్ల పెరుగు చిక్కగా, మీగడలా వస్తుంది.

ఇప్పుడు గోరువెచ్చని పాలలో 1 నుంచి 2 టీ స్పూన్ల పెరుగు వేసి, బాగా కలపాలి . తర్వాత ఆ గిన్నెపై మూత పెట్టాలి. ఇప్పుడు.. ఒక ప్రెజర్ కుక్కర్ ని తీసుకొని, అందులో కొద్దిగా నీళ్లు పోసి.. పెరుగు గిన్నెను లోపల పెట్టాలి.  ఇళప్పుడు కుక్కర్ మూత పెట్టి.. తక్కువ మంట మీద 12 నుంచి 15 నిమిషాలు వదిలేయాలి. విజిల్ మాత్రం పెట్టకూడదు.

33
ప్రెజర్ కుక్కర్ లో పెరుగు...

ప్రెజర్ కుక్కర్ లోని వేడి, పెరుగులో బ్యాక్టీరియా పెరగడానికి కారణం అవుతుంది. దీంతో పెరుగు తొందరగా గట్టిపడుతుంది. 15 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తీస్తే.. పెరుగు గట్టిగా మారుతుంది.  ఒకవేళ పెరుగు గడ్డలా మారలేదు అనిపిస్తే.. మరో 5 నిమిషాలు స్టవ్ మీద కుక్కర్ పెట్టి.. అందులో ఈ గిన్నె ఉంచితే సరిపోతుంది. 

పెరుగు గడ్డలా మారిన తర్వాత కూడా ఒక అరగంట పాటు ఫ్రిజ్ లో ఉంచితే.. ఆ పెరుగు రుచి పెరుగుతుంది. మీగడ కడుతుంది. రుచి కమ్మగా ఉంటుంది. ఈ సింపుల్ టెక్నిక్ తో మనం తక్కువ సమయంలో కూడా పెరుగు తయారు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories