Mangoes: వేసవి అంటే మొదట గుర్తొచ్చేది మామిడిపల్లే. ఈ మ్యాంగోను పండ్ల రారాజు అని కూడా అంటారు..మీకు తెలుసు కూడా. కానీ దొరికేది ఇంచుమించు 3 నెలలే. ఎంత తిన్నా తనివి తీరదు. అలా అని ఏడాదంతా తిందామంటే కుదరదు. మరెలా?
మామిడిపండు అంటే చాలామందికి ఎంతో ఇష్టం. సమ్మర్ లో లభించే ఈ రుచికరమైన పండు ఏడాది పొడవునా దొరికితే బాగుంటుందని అనిపిస్తుంది. కానీ మామిడిపండ్లు సీజనల్ కావడంతో ఈ సమ్మర్ లోనే అందుబాటులో ఉంటాయి. అయితే సరైన పద్ధతులు పాటిస్తే మామిడిపళ్ల రుచి ఏడాదిపాటు ఆస్వాదించవచ్చు. పండును నేరుగా నిల్వ చేయడం కష్టం అయినా, కొన్ని స్మార్ట్ స్టోరేజ్ టిప్స్‌తో ఇది సాధ్యమవుతుంది.
26
మచ్చలు లేకుండా, గాయాల్లేనివి తీసుకోవాలి
మామిడిపండ్లు పూర్తిగా పండినవే ఎంచుకోవాలి. మచ్చలు లేకుండా, గాయాల్లేనివి తీసుకోవడం మంచిది. పండిన తర్వాత వాటిని శుభ్రంగా కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. తడి ఉండగా నిల్వ చేస్తే త్వరగా పాడవుతాయి.
36
ఇలా చేస్తే 8–12 నెలల వరకు వాడుకోవచ్చు
మామిడిపళ్లను ఎక్కువకాలం నిల్వ చేయడానికి ఫ్రీజింగ్ మంచి మార్గం. ముందుగా పండును తొక్క తీసి ముక్కలుగా కట్ చేయాలి. గింజ తీసివేయాలి. ఆ ముక్కలను ఒక ట్రే మీద విడివిడిగా పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. పూర్తిగా గట్టిపడిన తర్వాత వాటిని ఎయిర్‌టైట్ కవర్లో లేదా బాక్స్‌లో వేసి మళ్లీ ఫ్రీజర్‌లో పెట్టాలి. ఇలా చేస్తే ముక్కలు అతుక్కుపోకుండా ఉంటాయి. ఈ విధంగా ఫ్రీజ్ చేసిన మామిడిపళ్లను 8–12 నెలల వరకు వాడుకోవచ్చు.
మరొక పద్ధతి ఏంటంటే..మామిడిపళ్ల పల్ప్ తయారు చేయడం. పండిన మామిడిపండ్ల గుజ్జును మిక్సీలో గ్రైండ్ చేసి పల్ప్‌గా తయారు చేయాలి. అందులో కొద్దిగా చక్కెర కలిపితే రుచి అలాగే ఉంటుంది. ఆ పల్ప్‌ను చిన్న చిన్న కంటైనర్లలో లేదా ఐస్ ట్రేల్లో పోసి ఫ్రీజర్‌లో ఉంచాలి. అవసరమైనప్పుడు తీసుకుని షేక్స్, జ్యూస్, స్వీట్స్‌లో వాడుకోవచ్చు.
56
డీహైడ్రేషన్ కూడా ఒక మంచి మార్గం
మామిడిపళ్ల ముక్కలను సన్నగా కట్ చేసి ఎండలో ఆరబెట్టాలి లేదా డీహైడ్రేటర్ ఉపయోగించాలి. పూర్తిగా ఆరిన తర్వాత ఎయిర్‌టైట్ డబ్బాలో ఉంచితే మామిడి ముక్కలు నెలల తరబడి నిల్వ ఉంటాయి. ఇవి స్నాక్‌లా తినవచ్చు.
66
పచ్చళ్లు కూడా ఏడాది వరకు నిల్వ ఉంటాయి
మామిడికాయలతో చేసే పచ్చళ్లు కూడా ఏడాది వరకు నిల్వ ఉంటాయి. ఉప్పు, నూనె సరైన మోతాదులో వాడితే పచ్చడి ఎక్కువకాలం పాడవకుండా ఉంటుంది. ఇది సంప్రదాయ పద్ధతి.
ముఖ్యంగా, నిల్వ చేసే సమయంలో గాలి చొరబడకుండా చూడాలి. ఎయిర్‌టైట్ కంటైనర్లు వాడాలి. ఫ్రీజర్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి. ఒకసారి బయటకు తీసిన పల్ప్‌ను మళ్లీ ఫ్రీజ్ చేయకూడదు.
మామిడిపండ్లు సీజన్‌లో ఎక్కువగా కొనుగోలు చేసి సరైన విధంగా ఫ్రీజ్ చేయడం లేదా పల్ప్, డ్రై స్లైసెస్ రూపంలో నిల్వ చేస్తే ఏడాది పొడవునా మామిడి రుచిని ఆస్వాదించవచ్చు.