2. మస్లిన్ వస్త్రం
ఆకులను శుభ్రంగా కడిగి, ఆరబెట్టిన తర్వాత, వాటిని ఒక శుభ్రమైన, పలుచని కాటన్ క్లాత్ లేదా మస్లిన్ క్లాత్ లో వదులుగా కట్టండి. ఈ మూటను రిఫ్రిజిరేటర్‌లోని కూరగాయల అరలో పెట్టాలి. ఆ క్లాత్ ఆకులలోని అధిక తేమను పీల్చుకుని, ఆకులు పాడవ్వకుండా తాజాగా ఉంటాయి.
3. ఆకులను ఫ్రీజర్‌లో నిల్వ చేయండి.
మీరు కరివేపాకును ఆరు నెలల కంటే ఎక్కువ కాలం నిల్వ చేయాలనుకుంటే, ఎండిన ఆకులలోని గాలిని పూర్తిగా తీసివేసి, వాటిని ఒక జిప్-లాక్ బ్యాగ్‌లో వేసి నేరుగా ఫ్రీజర్‌లో పెట్టండి. వాటిని ఉపయోగించవలసి వచ్చినప్పుడు, గుప్పెడు కరివేపాకు తీసుకుని నేరుగా తాలింపులో కలపండి. ఇలా చేయడం వల్ల వాటి రుచి, సువాసన ఎక్కువ కాలం నిలిచి ఉంటాయి.
4. నూనెలో వేయించండి
మీరు కరివేపాకును ఎక్కువ కాలం ఉపయోగించుకోవాలనుకుంటే, దానిని నూనెలో వేయించి నిల్వ చేసుకోవచ్చు. ఇందుకోసం, ఒక బాణలిలో అర టీస్పూన్ నూనె వేడి చేసి, కరివేపాకును తక్కువ మంట మీద తేలికగా వేయించండి. చల్లారిన తర్వాత, వాటిని ఒక గాజు సీసాలో వేసి ఫ్రిజ్‌లో భద్రపరచండి. ఇలా కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చు.
గమనిక...
అయితే.. కరివేపాకును నిల్వ చేయడానికి ముందు కొన్ని తప్పులు చేయకూడదు. నీటితో శుభ్రం చేసిన తర్వాత... ఎండలో ఆరబెట్టకూడదు. ఎండలో ఆరబెడితే.. కరివేపాకు అసలైన సువాసన, రుచి తగ్గిపోతాయి. వాటిని ఎప్పుడూ ఫ్యాన్ కింద మాత్రమే ఆరబెట్టాలి.