మ్యాగీ మసాలా తయారు చేసే విధానం....
ఈ మసాలా తయారు చేయడానికి ముందుగా ధనియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క వంటి మసాలా దినుసులన్నీ లైట్ గా ప్యాన్ లో వేయించాలి. మాడిపోకుండా చూసుకోవాలి. వేయించిన వాటిని చల్లార్చి.. మెత్తటి పొడిలా చేసుకోవాలి. ఇప్పుడు.. ఇందులో ఉల్లిపాయ పొడి, వెల్లుల్లి పొడి, ఆమ్చూర్ పొడి , కార్న్ ఫ్లోర్, ఉప్పు, పంచదార కూడా వేసి మరోసారి మిక్సీ పట్టాలి. అంతే.. మ్యాగీ మసాలా రెడీ అయిపోయినట్లే.
దీనిని మీరు గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఎన్ని నెలలు అయినా వాడుకోవచ్చు. బయట కొనే మ్యాగీ మసాలా కంటే రుచిగా ఉంటుంది. ఆరోగ్యంగా కూడా ఉంటుంది. దీనిని ఏవైనా ఫ్రై కూరలు చేసినప్పుడు పైన చల్లితే.. రుచి రెట్టింపు అవుతుంది. ఒక్కసారి ప్రయత్నించి చూడండి....