Parota: హోటల్ స్టైల్ లో పరోటాలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఇలా చేయండి

Published : Sep 18, 2025, 05:58 PM IST

Parota: పరోటాలను చాలా మంది ఇష్టంగా తింటుంటారు. వీటిని చాలా మంది ఇంట్లో కూడా తయారుచేస్తుంటారు. కానీ హోటల్లో మాదిరిగా పరోటాలు పొరలు పొరలుగా రావు. మీరు గనుక కొన్ని సింపుల్ టిప్స్ ను ఫాలో అయితే మీ పరోటాలు పొరలు పొరలుగా మెత్తగా వస్తాయి.

PREV
14
పరోటా తయారీ

ఇడ్లీ, దోశ, పూరీతో పాటుగా అప్పుడప్పుడు పరోటాలను కూడా చాలా మంది ఇంట్లో తయారుచేస్తుంటారు. ఎందుకంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. ఇంట్లో తయారుచేసిన పరోటాలు గట్టి గట్టిగా ఉంటాయి. పొరలు పొరలుగా అస్సలు కావు. ఇలాంటి పరోటాలను అస్సలు తినాలనిపించదు. కానీ కొన్ని సింపుల్ టిప్స్ తో హోటల్ స్టైల్ పరోటాలను తయారుచేయొచ్చు. మీరు చేసే పరోటాలు మెత్తగా, పొరలు పొరలుగా వస్తాయి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
పిండిని ఇలా కలపండి

చపాతీ, పూరీకి కలిపినట్టు పిండిని కలిపితే పరోటాలు సాఫ్ట్ గా, పొరలు పొరలుగా రావు. పరోటాలు మెత్తగా రావాలంటే మాత్రం పిండిని కొన్ని పద్దతుల్లో కలపాలి. అంటే ముందుగా గోధుమ పిండిలో కొంచెం ఉప్పును వేసి అందులో కొంచెం నెయ్యి లేదా నూనెను వేసి కలపండి. అలాగే కాచి చల్లార్చిన పాలను కూడా పోయొచ్చు. దీంట్లో మీరు టీస్పూన్ సూజీ రవ్వను కలిపినా కూడా పరోటాలు బాగా వస్తాయి. ఇక ఇప్పుడు దీంట్లో నీళ్లు పోసి పిండిని మెత్తగా కలపండి. ఇది చపాతీ పిండికంటే మెత్తగా ఉండేలా చూసుకోవాలి. నెయ్యి లేదా నూనె వేయడం వల్ల పిండి మెత్తగా అవుతుంది. పరోటాలు పొరలు పొరలు వస్తాయి.

34
కాసేపు పిండిని పక్కన పెట్టండి

హోటల్ స్టైల్ లో పరోటాలు రావాలంటే మాత్రం పిండిని కలిపిన తర్వాత వెంటనే పరోటాలను చేసేయకూడదు. కనీసం ఇరవై నిమిషాలైనా పక్కన పెట్టుకోవాలి. అప్పుడే పిండి సెట్ అయ్యి పరోటాలు మెత్తగా వస్తాయి. తర్వాత పిండిని మళ్లీ బాగా కలపండి. ఇప్పుడు బాల్స్ ను రెడీ చేసి పొడి పిండిని చుట్టూ అంటించండి. దీనివల్ల పరోటాలు బాగా వస్తాయి.

44
పరోటాలు చేసేటప్పుడు

మీరు పరోటాలను తయారుచేసేటప్పుడు కొంచెం పొడి పిండి, కొంచె నూనెను అప్లై చేయండి. పిండిని వీలైనంత సన్నని రోటీలా తయారుచేసిన తర్వాత పొడి పిండిని, కొంచెం నూనెను అప్లై చేసి నైఫ్ తో సన్నగా కట్ చేసుకోవాలి.దీనిపై ఆయిల్ ను అప్లై చేసి రోల్ చేసి మడతపెట్టండి. దీన్ని మళ్లీ చపాతీ కర్రతో చపాతీలా చేయాలి. ఇలా చేస్తే పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి.

ఇవి కూడా వేసుకోవచ్చు

పరోటాలు మరింత టేస్టీగా కావాలంటే మీరు దీనికి మసాలాలను కూడా కలపొచ్చు. ఇందుకోసం పరోటా పిండిలో మిరపపొడి, ధనియాల పౌడర్, చాట్ మసాలా కసూరి మేథీ, ఫెన్నెల్ పౌడర్ ను వేసుకోవచ్చు. దీనివల్ల పరోటాలు డిఫరెంట్ టేస్ట్ అవుతాయి. అయితే పరోటాలను ఎప్పుడూ కూడా మీడియం ఫ్లేం మీదే కాల్చాలి. రెండు వైపులా నూనె అప్లై చేస్తూ కాల్చుకోవాలి. ఇలా చేస్తే పరోటాలు పొరలు పొరలుగా వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories