Bitter Gourd: మన ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల్లో కాకరకాయ ఒకటి. దీన్ని తినడం వల్ల మనం ఎన్నో సమస్యల్ని తగ్గించుకోగలుగుతాం. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం ఈ కూరగాయను తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
నిజం చెప్పాలంటే చాలా మంది కాకరకాయ కూరంటే ముఖాన్ని అదోలా పెడుతుంటారు. ఆ కూరతో అస్సలు తిననే తినరు. ఎందుకంటే ఈ కూర చేదుగా ఉంటుంది కాబ్టటి. కానీ ఈ కూరగాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే కొంతమంది కాకరకాయను చాలా ఇష్టంగా తింటుంటారు. దీనిలో ఉండే పోషకాలు మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. కానీ కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం కాకరకాయను తినకూడదు. వాళ్లు ఎవరు? ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
25
టైప్ 1 డయాబెటీస్ ఉన్నవారు
టైప్ 1 ఉన్నవారు ప్రతిరోజూ మెడిసిన్స్ ను వేసుకుంటుంటారు. అప్పుడే షుగర్ కంట్రోల్ లో ఉంటుంది. అయితే ఇలాంటి వారు కాకరకాయను కానీ, దాని రసాన్ని కానీ తీసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మందులతో పాటుగా కాకరకాయను తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ మరింత తగ్గుతాయి. దీంతో శరీరం బలహీనంగా అవుతుంది. కొంతమందికి అయితే షుగర్ తగ్గి కళ్లు తిరిగి కిందపడిపోతారు.
35
కిడ్నీ స్టోన్స్
కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు కూడా కాకరకాయను తినకపోవడమే మంచిది. ఎందుకంటే దీనిలో ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కిడ్నీ స్టోన్స్ ను మరింత పెంచుతుంది. కాకరకాయలను ఎక్కువగా తింటే కిడ్నీల్లో రాళ్లు వచ్చే ప్రమాదం కూడా ఉంది. నిపుణుల ప్రకారం.. కాకరకాయ కిడ్నీల్లో విషాన్ని పెంచుతుంది. మొత్తంగా కిడ్నీల్లో రాళ్లు ఉన్నవారు కాకరకాయను తినకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ప్రెగ్నెన్సీ టైంలో కూడా కాకకరకాయలను తినకూడదు. ఎందుకంటే కాకరకాయను తింటే గర్భాశయం ప్రభావితం అవుతుంది. అలాగే కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
55
కాకరకాయ కూర చేదు కాకూదంటే ఏం చేయాలి?
కాకరకాయ కూర చేదుగా ఉంటుందనే దీన్ని తినకుండా ఉంటారు. అయితే కొన్ని చిట్కాలు ఫాలో అయితే ఈ చేదు తగ్గుతుంది. కాకరకాయ కూరను సరిగ్గా వండితే కూర చేదు కాదు. అయితే వీటిలోని గింజలు తీసేసి వండితే కాకరకాయ కూర చేదు కాదు. అలాగే ఈ కూరలో ఉల్లిపాయల్ని ఎక్కువగా వాడితే కూడా చేదు తగ్గుతుంది.