Fluffy Puri: పూరీలు పొంగాలంటే ఈ మ్యాజిక్ మంత్ర మిస్ అవ్వొద్దు

Published : Feb 28, 2026, 10:21 PM IST

Fluffy Puri: చాలా మందికి పూరీలు అంటే ఇష్టం. కానీ ఇంట్లో చేసుకునే పూరీలు గట్టిగా అయిపోయి, నూనె పీల్చుకోవడం, పొంగకపోవడం వంటి సమస్యలు ఉంటాయి. దానివల్ల తినాలన్న కోరిక చచ్చిపోతుంది. అయితే పూరీ పొంగి, హెల్దీగా కావాలంటే ఈ మ్యాజిక్ మంత్ర మీరు ఫాలో అయిపోండి.

PREV
15
పూరీలు పొంగాలంటే ఇలా చేయండి

పూరీలు చూడటానికి చాలా సింపుల్ అనిపించినా, పర్ఫెక్ట్‌గా చేయడం అంత ఈజీ కాదు. చాలా మంది ఇంట్లో పూరీలు చేస్తుంటారు కానీ అవి సరిగ్గా పొంగకపోవడం, ఎక్కువ నూనె పీల్చేయడం లేదా సాఫ్ట్‌గా కాకుండా గట్టిగా రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. ఎన్నిసార్లు చేసినా ఇదే సమస్యతో సతమవుతూ ఉంటారు. చివరకు ఇంట్లో చేసుకోవడం మానేస్తారు. మరి బయట హోటళ్లలో వచ్చేలా బంగారు రంగులో, కరకరలాడే పూరీలు చేయాలంటే ఈ చిన్న టెక్నిక్ ఫాలో అవ్వాలి. 

25
పూరీలకు అసలు సీక్రెట్ సూజీ రవ్వ..

పూరీలకు అసలు సీక్రెట్ సూజీ రవ్వ. కప్పు గోధుమ పిండికి ఒకటి లేదా రెండు టేబుల్ స్పూన్లు సన్నని సూజీ కలిపితే పిండికి మంచి స్ట్రక్చర్ వస్తుంది. దీంతో పూరీలు వేయించినప్పుడు తక్కువ నూనె పీల్చుకుంటాయి. అలాగే అవి పొంగి, కరకరలాడే టెక్స్చర్‌తో వస్తాయి. 

35
పిండి కలిపే విధానంలోనే అసలు మ్యాజిక్

పిండి కలిపే విధానంలోనే అసలు మ్యాజిక్. మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ముద్ద చేయాలి. పిండిని బాగా పిసికి కనీసం 15 నుంచి 20 నిమిషాలు మూతపెట్టి ఉంచాలి. ఇలా రెస్ట్ ఇవ్వడం వల్ల గ్లూటెన్ సెట్ అవుతుంది, వేయించినప్పుడు పూరీలు సరిగ్గా పఫ్ అవుతాయి. వేయించే నూనె కూడా చాలా ముఖ్యమే. నూనె బాగా వేడి అయి మెరుస్తూ ఉండాలి కానీ పొగ రాకూడదు, ఇది గుర్తుంచుకోండి. సరైన టెంపరేచర్‌లో వేయిస్తే పూరీలు వెంటనే ఉబ్బుతాయి. 

45
హెల్తీ ఆప్షన్ కోసం గోధుమ పిండి బెటర్

అలాగే పూరిల విషయంలో హెల్తీ ఆప్షన్ కోసం ఈ సింపుల్ టిప్స్ పాటించండి. పూరీలకు గోధుమ పిండినే ఉపయోగించడం వల్ల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పిండిని గట్టిగా కలపాలి. మెత్తగా ఉంటే ఎక్కువ నూనె పీల్చుకుంటుంది. రోలింగ్ సమయంలో పొడి పిండి ఎక్కువగా వాడకూడదు. బదులుగా ప్లాట్‌ఫారమ్‌పై తేలికగా నూనె రాసుకుంటే సరిపోతుంది. జీర్ణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చిటికెడు జీలకర్ర వేసినా మంచిది. 

55
ఇలా చేస్తే ఇంట్లోనే క్రిస్పీ పూరీలు

వేయించిన తర్వాత పూరీలను పేపర్ టవల్ లేదా స్టీల్ ర్యాక్ మీద ఉంచాలి. దీంతో అదనపు నూనె బయటకు వస్తుంది. ఈ చిన్న మార్పులతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్, తక్కువ నూనె పట్టే, గోల్డెన్ రంగులో కరకరలాడే పూరీలు ఈజీగా తయారు చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories