Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? మీకోసమే కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు

Published : Feb 28, 2026, 02:32 PM IST

Smart Kitchen Hack: రోజూ ఒకే ఫుడ్ తో బోర్ కొడుతుందా? డైలీ కొత్తగా ఏం వండాలి? ఏం తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇప్పుడా బెంగ అవసరం లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే డిఫరెంట్ గా, అండ్ హెల్దీ మీల్, టిఫిన్, స్నాక్ తయారుచేసుకోవచ్చు. 

PREV
15
క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు

రోజూ ఒకే రకం ఫుడ్ తింటూ ఉంటే ఎవరికైనా విసుగొస్తుంది. సేమ్ ఇడ్లీ, సేమ్ పప్పు, సేమ్ డైనింగ్ టేబుల్...రోజూ తిని తిని ఫుడ్ పై బోర్ కొడుతుంది. దీంతో బయట జంక్, హోటల్స్ కు ఎట్రాక్ట్ అవుతారు. డబ్బు ఖర్చు, ఆరోగ్యం మటాస్. మరెలా అంటూ ఆలోచిస్తున్నారా? అలా అని వంటగదిలో ఓ హైరానా పడిపోవద్దు. చిన్న చిన్న ఐడియాలతో రోజువారీ ఫుడ్ నే కొద్దిగా వెరైటీగా ఆలోచిస్తే కొత్త రుచులను సృష్టించవచ్చు. మరి మీకోసం కొన్ని క్రియేటివ్ కుకింగ్ ఐడియాలు చూసేద్దాం.

25
కలర్ ఫుల్ బ్రేక్ ఫాస్ట్

సాధారణంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తినే ఓట్స్‌ను కేవలం నీటిలో లేదా పాలలో ఉడికించడం కాకుండా, కొద్దిగా నెయ్యిలో తేలికగా వేయించి తరువాత పాలు, డ్రై ఫ్రూట్స్‌తో కలిపితే సువాసనగల పుడ్డింగ్‌లా తయారవుతుంది. రుచి మాత్రమే కాదు, టెక్స్చర్ కూడా మారుతుంది. అలాగే ఉడికించిన పచ్చి బఠానీలను మెత్తగా చేసి గోధుమ పిండిలో కలిపి చపాతీలు చేస్తే ఆకుపచ్చ రంగుతో పాటు అదనపు ప్రోటీన్ లభిస్తుంది. పిల్లలు ఇలాంటి రంగురంగుల వంటకాలను ఇష్టంగా తింటారని చాలామంది చెబుతున్నారు.

35
చిన్న టిప్ తో మృదువైన చపాతీలు

మామూలుగా గోధుమ పిండితో చపాతీలు చేసే బదులు రాగి పిండిని సమాన మోతాదులో కలపాలి. దీనితో చేసే చపాతీలు లేదా పూరీలు ఎక్కువ ఫైబర్, ఐరన్ అందిస్తాయి. పిండిలో కొద్దిగా ఉడికించిన పసుపు కలిపితే చపాతీలు మృదువుగా రావడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. ఈ చిన్న మార్పులు మామూలు భోజనాన్ని కూడా డిఫరెంట్ గా మార్చేస్తుంది. 

45
సైడ్ డిష్ గా బేబీ పొటాటో ఫ్రై

బేబీ పొటాటోలను పచ్చి బఠానీలతో కలిపి తక్కువ మసాలాతో వేయిస్తే సింపుల్ అయినా రుచికరమైన సైడ్ డిష్ సిద్ధమవుతుంది. ఇంట్లో తరచుగా పారేసే నారింజ తొక్కలను సన్నగా తరిగి సూప్‌లలో లేదా స్ట్యూలలో వాడితే లైట్ సిట్రస్ ఫ్లేవర్ వస్తుంది. ఇలా మిగిలిపోయే పదార్థాలను వినియోగించడం ద్వారా ఫుడ్ వేస్ట్ కూడా తగ్గించవచ్చు.

55
సింపుల్ స్వీట్ ఐడియా

ఇంకా ఒక సింపుల్ స్వీట్ ఐడియా ఏమిటంటే ఉడికించిన బీట్‌రూట్‌ను మెత్తగా చేసి బెల్లం, ఏలకుల పొడి కలిపి తక్కువ నెయ్యితో వేపడం. ఇది సహజ రంగుతో పాటు మంచి పోషక విలువలున్న డెజర్ట్‌గా మారుతుంది. మునగ ఆకులు, చిన్న ఉల్లిపాయలు వంటి పదార్థాలను కూరల్లో చేర్చడం ద్వారా విటమిన్లు, మినరల్స్ పెరుగుతాయి.

రోజువారీ వంటలో చిన్న ప్రయోగాలు చేస్తే భోజనం కొత్తగా,హెల్దీగా మారుతుంది. ఖరీదైన భోజనం కాకుండా ఆరోగ్యకరమైన ఆహారం తినొచ్చు. మన దగ్గర ఉన్నవాటినే సృజనాత్మకంగా ఉపయోగిస్తే చాలు. రుచికి రుచి పోషకాలకు పోషకాలు. ఈసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. 

Read more Photos on
click me!

Recommended Stories