బయట ఎండలు మండిపోతున్నాయి. ఇలాంటి వేడిలో శరీరాన్ని చల్లపరిచేందుకు సహజ డ్రింక్స్ తాగడం చాలా అవసరం. లేకపోతే శరీరం డీహైడ్రేట్ అయ్యి.. ఆరోగ్య సమస్యలు వస్తాయి.కాబట్టి.. సమ్మర్ లో వేడితాపం తగ్గించుకోవడానికి ఎక్కువ మంది కొబ్బరి నీరు తాగడానికి ఇష్టపడతారు. ఎందుకంటే కొబ్బరి నీటిలో తక్కువ కాలరీలు ఉంటాయి. శరీరాన్ని ఎక్కువగా హైడ్రేటెడ్ గా ఉంచుతుంది. సమ్మర్ కదా.. బయట కొంబరి బోండం ధర కూడా కాస్త ఎక్కువగానే ఉంటోంది. చిన్న బొండం రూ.50, పెద్ద బొండం రూ.80 నుంచి రూ.100 వరకు అమ్ముతున్నారు. అంత పెట్టి కొన్నా కూడా.. ఆ బొండంలో గుక్కెడు నీళ్లు కూడా ఉండటం లేదు. ఇలా మీకు కూడా అనిపిస్తోందా? మరి, నీళ్లు ఎక్కువగా ఉండే కొబ్బరి బోండం ఎలా ఎంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందామా..
coconut water
కొబ్బరి బోండం నీళ్లు తాగడం ఆరోగ్యానికి మంచిది. అయితే.. ఎక్కువ నీళ్లు ఉన్న బోండం ఎంచుకోవడం మన చేతిలోనే ఉంటుంది. బోండంలో చాలా రకాలు ఉంటాయి. కొన్ని గుండ్రంగా ఉంటాయి.. మరికొన్ని పొడవుగా ఉంటాయి. అయితే.. పొడవాటి బోండంలో నీరు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే.. మీరు ఎప్పుడైనా గుండ్రంగా ఉన్న వాటిని మాత్రమే ఎంచుకోవడం ఉత్తమం.
అంతేకాదు.. మీరు తాగాలి అనుకునే ముందు బోండం చేతిలోకి తీసుకొని.. దానిని మరో రెండింటితో బరువు పోల్చి చూడండి. ఏది బరువు ఎక్కువగా ఉంటే.. అందులో నీరు ఎక్కువగా ఉంటాయని అర్థం. అయితే.. ఎండిపోయిన వాటిని మాత్రం ఎంచుకోవచ్చు. అవి ఎప్పుడూ తేలికగానే ఉంటాయి. వాటిలో నీరు అస్సలు ఉండదు.
బోండాన్ని షేక్ చేయండి
కొబ్బరికాయను చెక్కుచెదరకుండా షేక్ చేయండి. లోపల నీటి శబ్దం స్పష్టంగా వినిపిస్తే అందులో నీరు తక్కువగా ఉందని అర్థం. అయితే నీటి శబ్దం కాస్త నెమ్మదిగా, మెల్లగా వినిపిస్తే అది పూర్తిగా నిండిన బోండం అని భావించవచ్చు.అందులో నీరు ఎక్కువగా ఉంటాయి.
పరిమాణం కన్నా ఆకారం ముఖ్యం
పెద్ద బోండమే ఎక్కువ నీరు ఇస్తుందనుకోవడం తప్పు. ఎంత పెద్ద బోండం తీసుకుంటే అందులో నీళ్లు ఎక్కువగా ఉంటాయి అని అనుకోవద్దు. మరీ పెద్ది, అలా అని మరీ చిన్నది కాకుండా.. మీడియం సైజు బోండం ఎంచుకోవడం మంచిది. అందులో మీకు నీళ్లు ఎక్కువగా లభిస్తాయి.
ఆకుపచ్చ రంగు చూడండి
కొబ్బరి బోండం రంగు కూడా కీలకమైన అంశం. ముదురు గోధుమ మచ్చలతో ఉండే బోండం అంటే అది కొంచెం పరిపక్వ దశలో ఉంది. అంటే నీరు తక్కువగా ఉంటుంది. కానీ లైట్ గ్రీన్ కలర్ ఉన్న బోండం తీసుకుంటే తాజా, అధిక నీరు ఉంటుందని అర్థం.కొంతమందికి కొబ్బరి గుజ్జుతో కలసిన నీరు తీయగా ఉంటుందని ఇష్టం. అలాంటి బోండాల్లో నీటి కంటెంట్ కాస్త తక్కువగా ఉంటుంది. కావున మీకు గుజ్జు కావాలా, ఎక్కువ నీరా అనే ప్రాధాన్యత ఆధారంగా ఎంపిక చేసుకోవాలి.
తాగడంలో ఆలస్యం చేయకండి
కొనగొన్న వెంటనే కొబ్బరి నీటిని తాగేయడం ఉత్తమం. అలా చేయకపోతే, దానిలోని పోషకాలు తగ్గిపోతాయి. ఫ్రెష్‌గా తాగితేనే మీరు అన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందగలుగుతారు.