ఈ వర్షాకాలంలో అదిరిపోయే చికెన్‌ పచ్చడి..పక్కా కొలతలతో ఇలా చేశారంటే..ఆహా అనాల్సిందే!

Published : Jul 02, 2025, 02:22 PM IST

చికెన్ పచ్చడి బయట కొనకుండా ఇంట్లోనే రుచిగా తయారు చేసుకోవచ్చు. సరైన మసాలాలతో తయారీ విధానం తెలుసుకోండి.

PREV
15
చికెన్ పచ్చడి

చికెన్ పచ్చడి పేరు వింటేనే నోరు ఊరుతుంది. కానీ దాన్ని రెస్టారెంట్స్‌ లో గాని, మార్కెట్లలో గాని కొనాలంటే ఖర్చుతో పాటు రుచి విషయంలో నమ్మకంగా ఉండదు. ఎక్కువకాలం నిల్వ ఉంచాలనే ఉద్దేశంతో కొన్ని బ్రాండ్లు నూనె ఎక్కువగా వేసి దాన్ని పైన తేలిపోయేలా చేస్తుంటాయి. దీంతో అసలైన చికెన్ టేస్ట్ కంటే నూనె రుచే ఎక్కువగా అనిపిస్తుంది. కానీ, మనం ఇంట్లోనే కొన్ని సరళమైన పదార్థాలతో చికెన్ పచ్చడి తయారు చేస్తే రుచికి కూడా గ్యారెంటీ, ఆరోగ్యపరంగా కూడా భద్రత.

25
బోన్‌లెస్ ముక్కలు

చికెన్ పచ్చడికి బోన్‌లెస్ ముక్కలు ఎక్కువ రుచిగా ఉంటాయి. బ్రెస్ట్ ముక్కలతో పోలిస్తే ఇవి మృదువుగా, తినడానికి బాగా ఇష్టపడతారు పిల్లలు. మొదటగా అర కిలో బోన్‌లెస్ చికెన్ తీసుకుని తరిగి, అందులో కొద్దిగా ఉప్పు, పసుపు కలిపి మరిగించాలి. స్టవ్ మీద మీడియం మంటపై ఉడికిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడకనివ్వాలి. చికెన్ నీరు ఇంకిపోయేంత వరకు పూర్తిగా మరగనివ్వాలి.

35
మసాలాలు

పచ్చడికి కావాల్సిన మసాలాలు వేయించాలి. ఒక చిన్న పాన్‌లో జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని కొద్దిగా రంగు మారేంత వరకు వేయించి చల్లారిన తర్వాత మెత్తగా పొడి చేయాలి. ఇదే పచ్చడికి మెయిన్‌.పైన మరిగిన చికెన్‌ను కొద్దిగా చల్లార్చి చేతితో తుంచి చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి 250 గ్రాముల నూనె వేసి, దానిలో ఈ ముక్కలను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తక్కువ మంటపై వేయించాలి. ఈ సమయంలో రెండు రెమ్మల కరివేపాకు వేసి మరింత సువాసన రానివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి జల్లుగా వేయించాలి.

45
చికెన్ బ్రౌన్‌ కలర్‌

చికెన్ బ్రౌన్‌ కలర్‌ వచ్చేంత వరకు వేయించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అప్పుడే వేడి ఉండగానే మసాలా పొడి కలపాలి. ఇక 50 గ్రాముల కారం, సరిపడిన ఉప్పు వేసి బాగా కలపాలి. ఉప్పు తక్కువగా వేసి, అవసరమైతే చివర్లో పెంచుకోవడమే మంచిది.చివరగా, చికెన్ పూర్తిగా చల్లారిన తర్వాత మూడు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలిపి బాగా కలపాలి. వేడి మీద నిమ్మరసం కలిపితే చేదు వాసన రావచ్చు. అందుకే పచ్చడి పూర్తిగా చల్లారిన తర్వాతే నిమ్మరసం కలపాలి. అవసరమైతే చివర్లో మరికొంత ఉప్పు లేదా నూనె కలిపి, సీసాలో నిల్వ చేసుకుంటే ఈ పచ్చడి మూడు నెలల వరకు ఉంచి తినవచ్చు

55
హైజనిక్ చికెన్ పచ్చడి

ఇలా ఇంట్లో చేసుకుంటే, అధిక ధరలు ఖర్చు చేయకుండానే రుచి గల, హైజనిక్ చికెన్ పచ్చడి మీ ఇంట్లో రెడీ అవుతుంది. ఈ రెసిపీ అనుసరిస్తే మీరు ప్రతీసారి రుచిగా, ముద్దగా ఉండే చికెన్ పచ్చడి తినవచ్చు. మసాలాలు, చికెన్ నాణ్యతను చూసుకుంటే ఈ పచ్చడి తప్పకుండా కేవలం రెండు రోజుల్లోనే స్వాహా చేసేస్తారు. 

Read more Photos on
click me!

Recommended Stories