Health: ఇవి పిచ్చి ఆకులు అనుకుంటే మీరే పిచ్చోళ్లు.. అస‌లు మ్యాట‌ర్ వేరే ఉంది

Published : Jan 24, 2026, 09:56 AM IST

Health: ప్ర‌కృతి మ‌న‌కు ఎన్నో అద్భుత ఔష‌ధాలను స‌హ‌జంగా అందిస్తుంది. వాటిని స‌రిగ్గా ఉప‌యోగించుకుంటే ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ల‌భిస్తాయి. అలాంటి ఓ అద్భుత‌మే గ‌లిజేరు ఆకు. రోడ్డు ప‌క్క‌న క‌నిపించే ఈ సాధార‌ణ ఆకులో ఎన్నో ఔష‌ధ గుణాలున్నాయ‌ని మీకు తెలుసా 

PREV
15
గలిజేరు ఆకు అంటే ఏమిటి?

గలిజేరు అనేది మన చుట్టూ చాలా సాధారణంగా కనిపించే ఒక మొక్క. ఇంటి ముందు, రోడ్ల పక్కన, పొలాల గట్లపై, బీడు భూముల్లో ఈ మొక్క తీగలా పాకుతుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా పెరుగుతుంది. గ్రామాల్లో ఉన్నవాళ్లకు ఇది బాగా తెలుసు. పట్టణాల్లో పెరిగినవాళ్లకు మాత్రం దీని గురించి పెద్దగా అవగాహన ఉండదు. గలిజేరు ఆకును చాలా చోట్ల ఆకుకూరలా వండుకుని తింటారు. ఇందులో ఎర్ర గలిజేరు, తెల్ల గలిజేరు అనే రెండు రకాలున్నాయి. ఆయుర్వేదం, ఇంటి వైద్యంలో ఈ మొక్కకు మంచి ప్రాధాన్యం ఉంది.

25
కిడ్నీ ఆరోగ్యానికి గలిజేరు

ప్ర‌స్తుతం చాలామందిని కిడ్నీ సమస్యలు వేధిస్తున్నాయి. గలిజేరు ఆకును ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీ ఆరోగ్యానికి మేలు జరుగుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకులో ఉండే పోషకాలు మూత్ర ప్రవాహాన్ని మెరుగుపరుస్తాయి. దాంతో కిడ్నీలో పేరుకుపోయే అనవసర పదార్థాలు బయటకు వెళ్లడానికి సహాయపడతాయి. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటానికి కూడా ఇది ఉపయోగపడుతుందని చెబుతారు. అలాగే మూత్రనాళ ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో గలిజేరు సహకరిస్తుందనే అభిప్రాయం ఉంది.

35
లివర్ శుభ్రతకు మేలు

గలిజేరు ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి లివర్‌ను శుభ్రంగా ఉంచేందుకు సహాయపడతాయి. రెగ్యుల‌ర్‌గా ఈ ఆకును తినడం వల్ల లివర్ పనితీరు మెరుగవుతుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫ్యాటీ లివర్ సమస్య వచ్చే అవకాశాన్ని తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని అంటున్నారు.

45
ఎముకలు, కీళ్లకు బలం

ఈ ఆకుకూరలో కాల్షియం మంచి స్థాయిలో ఉంటుంది. దాంతో ఎముకలు బలంగా ఉండేందుకు సహాయపడుతుంది. కీళ్ల నొప్పులు, కాళ్ల వాపు, ఆర్థరైటిస్ వంటి సమస్యలున్నవాళ్లకు గలిజేరు కొంత ఉపశమనం ఇవ్వవచ్చని చెబుతున్నారు. అలాగే రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఇది సహాయపడుతుందని కొన్ని ఆయుర్వేద అధ్యయనాలు సూచిస్తున్నాయి.

55
మెరుగైన జీర్ణ‌క్రియ‌కు

గలిజేరు ఆకును తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం. ఈ ఆకును ఆకుకూరలా వండుకుని తినవచ్చు, పప్పులో కలిపి వండుకోవచ్చు, అలాగే కషాయం మాదిరిగా మరిగించి తాగవచ్చు. ఆకులను ఎండబెట్టి పొడి చేసి గోరువెచ్చని నీటిలో కలిపి తీసుకోవచ్చు.

గమనిక: దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారు లేదా మందులు వాడుతున్నవారు తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకుని మాత్రమే గలిజేరు ఉపయోగించాలి.

Read more Photos on
click me!

Recommended Stories