చలికాలంలో పుట్టగొడుగులు తినడం వల్ల ఎన్ని లాభాలున్నాయో..!

First Published | Nov 7, 2023, 1:19 PM IST

చలికాలంలో కొన్ని రకాల ఆహారాలను తింటే మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ సీజన్ లో తప్పకుండా తినాల్సిన వాటిలో పుట్టగొడుగుల ఒకటి. అవును వీటిని తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. అవేంటంటే..
 

Image: Getty Images

సీజన్ తో సంబంధం లేకుండా పుట్టగొడుగులు మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి. కానీ చలికాలంలో వీటిని తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పుట్టగొడుగులతో ఎన్నో రకాల వంటలను తయారుచేస్తారు. వీటిలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి మనల్ని చలికాలంలో ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 
 

mushrooms

పుట్టగొడుగుల్లో  ఐరన్, పొటాషియం, కాపర్,  ఫైబర్ వంటి అన్ని రకాల పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిని ఈ సీజన్ లో తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మరి చలికాలంలో పుట్టగొడుగులను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం.. 


కొలెస్ట్రాల్ తగ్గుదల 

శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండెపోటు వంటి ఎన్నో ప్రాణాంతక రోగాలు వస్తాయి. అయితే ఈ సమస్యతో బాధపడేవారికి పుట్టగొడుగులు మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎలా అంటే ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ మొత్తాన్ని తగ్గించడానికి సహాయపడతాయి.

క్యాన్సర్ నివారణ

పోషకాలు పుష్కలంగా ఉండే పుట్టగొడుగులు కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పుట్టగొడుగుల్లో ఉండే ఎర్గోథియోనిన్ శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. పుట్టగొడుగులను మన రోజువారి ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు తగ్గుతాయని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. 
 

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం 

పుట్టగొడుగులు తినడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుంది. దీంతో దగ్గు, జలుబు వంటి ఎన్నో సమస్యలను దూరం చేసుకోవచ్చు. ముందే ఈ సీజన్ లో మన ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని చలికాలంలో తప్పకుండా తినండి. 
 

హైబీపీ నార్మల్ 

అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు కూడా పుట్టగొడుగులను తినొచ్చు. వీటిలో సోడియం చాలా తక్కువగా ఉంటుంది. తగినంత మొత్తంలో పొటాషియం ఉంటుంది. ఇది హైబీపీని నియంత్రించడానికి సహాయపడుతుంది.

బరువు తగ్గడానికి

పుట్ట గొడుగులను తిన్నా కూడా బరువు తగ్గుతారు. ఎందుకంటే వీటిలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. దీంతో మీరు సులువుగా బరువు తగ్గుతారు. చలికాలంలో మీరు బరువు తగ్గాలనుకుంటే పుట్టగొడుగులను మీ డైట్ లో చేర్చుకోండి. 
 

కళ్లకు మేలు 

పుట్టగొడుగుల్లో విటమిన్  ఎ పుష్కలంగా ఉంటుంది. వీటిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. దీనిలో ఉండేబీటా కెరోటిన్ కంటి చూపు మందగించడం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాదు  పుట్టగొడుగుల్లో విటమిన్ బి 2 కూడా ఉంటుంది. ఇది మన చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Latest Videos

click me!