చలికాలంలో ఈ కూరగాయలను తిన్నారంటే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు

First Published | Nov 6, 2023, 1:30 PM IST

చలికాలంలో మన రోగనిరోధక శక్తి తగ్గుతూ ఉంటుంది. దీనివల్ల ఎన్నో రోగాలు వస్తాయి. అయితే మన ఆహారపు అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును ఈ సీజన్ లో మనం కొన్ని రకాల ఆహారాలను తింటే మనకు ఎన్నో రోగాలొచ్చే ముప్పు తప్పుతుంది. 
 

చలికాలంలో వచ్చేసింది. నవంబర్ స్టార్టింగ్ లోనే తేలికపాటి చలి మొదలైంది. మారుతున్న వాతావరణం మన ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఈ చలికలంలో మన ఇమ్యూనిటీ పవర్ బాగా తగ్గిపోతుంది. దీంతో మనం ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాల బారిన పడే అవకాశం ఉంది. అయితే ఈ సీజన్ లో మనం కొన్ని రకాల ఆహారాలను తింటే ఎన్నో రోగాలకు దూరంగా ఉండొచ్చు. అవును కొన్ని రకాల ఆహారాలు మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. 
 

చలికాలంలో తప్పకుండా తినాల్సిన ఆహారాల్లో గ్రీన్ వెజిటేబుల్స్ ఒకటి. ఆకుపచ్చ కూరగాయలు మనల్ని శక్తివంతంగా ఉంచడమే కాకుండా ఎన్నో వ్యాధులకు కూడా దూరంగా ఉంచుతాయి. ఇంతకీ ఈ సీజన్ లో ఎలాంటి ఆహారాలను తినాలంటే? 


fenugreek leaves

మెంతికూర

చలికాలంలో మెంతికూరను బాగా పండిస్తాయి. ఈ ఆకుకూరలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీన్ని తింటే  ఆకలి నియంత్రణలో ఉంటుంది. దీనివల్ల మీరు అతిగా తినలేరు. ఫలితంగా మీరు బరువు కూడా తగ్గుతారు. ఈ ఆకుకూర  మిమ్మల్ని ఫిట్ గా ఉంచడమే కాకుండా ఆరోగ్యంగా, శక్తివంతంగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. 
 

గోరుచిక్కుడు

గోరు చిక్కుడులో ఫైబర్, పొటాషియం లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో కేలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. కానీ మొక్కల ప్రోటీన్ మెండుగా ఉంటుంది. అందుకే చలికాలంలో వీటిని తింటే మీరు చాలా సులువుగా బరువు తగ్గుతారు. అలాగే చెడు కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఈ కూరగాయ రక్తపోటును నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది.  దీంతో మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

coriander leaves

కొత్తిమీర 

కొత్తిమీరను చాలా మంది వంటకాలను గార్నిష్ చేయడానికి లేదా చట్నీలు మొదలైన వాటికే ఎక్కువగా ఉపయోగిస్తారు. కానీ ఈ కొత్తిమీర ఆకులు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. ఇది మన కంటి చూపును మెరుగుపరుస్తుంది. అలాగే ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుతుంది. అంతేకాదు ఈ ఆకులు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. మీకు తెలుసా? కొత్తిమీర మన ఎముకలను బలంగా ఉంచుతుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 
 

బచ్చలికూర

ఇతర కాలాలతో పోలిస్తే చలికాలంలోనే బచ్లికూర మార్కెట్ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ బచ్చలికూర అన్ని ఆకుకూరల కంటే మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బచ్చలికూర క్యాన్సర్ నుంచి రక్షించడమే కాకుండా.. బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తుంది. ఎముకలను బలంగా ఉంచుతుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. అలాగే అధిక రక్తపోటును, మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. 

green peas

పచ్చి బఠానీ

పచ్చి బఠానీల్లో విటమిన్ సి, విటమిన్ ఇ, జింక్, ఇతర యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. వీటిని చలికాలంలో ఎక్కువగా తింటారు. ఎందుకంటే ఇవి మన ఇమ్యూనిటీ పవర్ ను బాగా పెంచుతాయి. దీనిలో విటమిన్ ఎ కూడా ఉంటుంది. ఇది మన కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. చలికాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ఈ కూరగాయలను ఖచ్చితంగా తినండి. 
 

Latest Videos

click me!