Ivy Gourd: వర్షాకాలంలో దొండకాయ తినొచ్చా? తింటే ఏమౌతుంది?

Published : Aug 15, 2025, 03:34 PM IST

దొండకాయ తింటే తెలివి తేటలు పెరగవు అని.. మతి మరుపు వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు.

PREV
15
ivy gourd

మనకు చాలా సులభంగా దొరికే కూరగాయల్లో దొండకాయ ఒకటి. ఈజీగా దొరుకుతుంది అనేమో... దీనిని తొందరగా ఎవరూ పట్టించుకోరు. అన్ని కూరగాయలు సీజన్లను పట్టి రేట్లు భారీగా పెరుగుతున్నా దొండకాయ మాత్రం అందరికీ అందుబాటు ధరలోనే లభిస్తూ ఉంటుంది. అందుకే.. అన్ని కూరగాయలకంటే.. దొండకాయ పై చాలా చిన్నచూపు ఉందేమో అనే ఫీలింగ్ ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. పైగా.. దొండకాయ తింటే తెలివి తేటలు పెరగవు అని.. మతి మరుపు వస్తుందనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ.. అందులో ఏ మాత్రం నిజం లేదు. నిజం చెప్పాలంటే.. దీని వల్ల కలిగే ప్రయోజనాల ముందు మరే ఏ కూరగాయ అయినా తక్కువ అనే చెప్పాలి. మరి.. ఈ దొండకాయను వానాకాలంలో రెగ్యులర్ గా తినడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి..? అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం...

25
దొండకాయలో పోషకాలు..

దొండకాయల్లో మన ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు అందిస్తుంది. ఈ దొండకాయలో ఫైబర్, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి ఉంటాయి. ఈ కూరగాయను తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ ని నియంత్రించడానికి, శరీరంలో వాపు తగ్గించడానికి సహాయపడుతుంది.

35
దొండకాయ ప్రయోజనాలు..

రోగనిరోధక శక్తిని పెంచుతుంది..

మొత్తం ఆరోగ్యానికి బలమైన రోగనిరోధక వ్యవస్థ అవసరం. దొండకాయలోని విటమిన్ సి కంటెంట్ శరీరం సహజ రక్షణ విధానాలను పెంచుతుంది. విటమిన్ సి తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి ఇవి సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడానికి, సాధారణ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి సహాయపడుతుంది.

రక్తంలో చక్కెర నియంత్రణ..

మధుమేహం ఉన్నవారు అన్ని రకాల కూరగాయలను తినలేరు. అలాంటివారు.. దొండకాయను మాత్రం నిస్సేందేహంగా తినవచ్చు. ఇందులో ఉండే శక్తివంతమైన బయోయాక్టివ్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. దొండకాయను రెగ్యులర్ గా తినడం వల్ల ఆహారంలో చేర్చుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.

45
మొటిమల సమస్యను తగ్గించే దొండకాయ..

చాలా మంది టీనేజ్ వయసు నుంచే ముఖంపై మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. ఇవి చర్మాన్ని డ్యామేజ్ చేయడంతో పాటు, యూత్ లో కాన్ఫిడెన్స్ ని తగ్గించేస్తాయి, కానీ.. ఇదే దొండకాయ తింటే ఆ సమస్య రాదు. మీరు చదివింది నిజమే. దొండకాయలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ మన చర్మాన్ని అందంగా మార్చడానికి సహాయపడతాయి. చర్మంపై మొటిమలను తగ్గించి.. స్కిన్ ని రిపేర్ చేయడానికి సహాయపడాయి.

గట్ ఆరోగ్యం

మనం పూర్తి ఆరోగ్యంగా ఉండాలి అంటే.. మన గట్ హెల్త్ కూడా బాగుండాలి. ఆ గట్ హెల్త్ ని సరి చేయడంలో మనకు దొండకాయ చాలా బాగా సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. మలబద్దకం సమస్య కూడా ఉండదు. ఎవరైనా జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లయితే.. వారు ఈ దొండకాయను డైట్ లో భాగం చేసుకోవాలి.దీనిలో ఉండే ఫైబర్ సహజ భేదిమందుగా పనిచేయడమే కాకుండా క్రమం తప్పకుండా ప్రేగు కదలికలకు సహాయపడుతుంది.జీవక్రియ ప్రక్రియలను పెంచుతుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు... మంటను తగ్గించడంలో సహాయపడతాయి. సమతుల్య ,ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మరింత మద్దతు ఇస్తాయి.

55
గుండె ఆరోగ్యం

ఈ దొండకాయ బరువు తగ్గడానికి, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి మాత్రమే కాదు.. మన గుండె ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తాయి.దీనిలోని అధిక ఫైబర్ కంటెంట్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడి తగ్గించడం ద్వారా గుండెను రక్షిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories