Cooking Tips: బియ్యం, పప్పు లను నానబెట్టి ఎందుకు వండాలి?

Published : Aug 15, 2025, 11:46 AM IST

చాలా మంది బియ్యాన్ని, పప్పులను నానబెట్టి వండుకుని తింటుంటారు. ఇలా వండితే అన్నం కానీ, పప్పు కానీ చాలా తొందరగా ఉడుకి గ్యాస్ ఆదా అవుతుందని అనుకుంటారు. కానీ దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి తెలుసా?

PREV
14
బియ్యం

చాలా మంది ఆడవారు వంట చేయడానికి ముందు బియ్యాన్ని బాగా కడిగి నానబెట్టి వండేస్తుంటారు. ఒక్క బియ్యమే కాదు పప్పులను కూడా నానబెట్టే ఉడికిస్తుంటారు. ఇలా ఎందుకు చేస్తామన్న సంగతి చాలా మందికి తెలియదు. 

అయితే ఇలా బియ్యాన్ని, పప్పును నానబెడితే అవి తొందరగా ఉడుకుతాయని చాలా మంది చెప్తుంటారు. ఇది నిజమే. కానీ ఇలా ముందు నానబెట్టడానికి వేరే రీజన్ కూడా ఉంది. మీకు తెలుసా? మన పూర్వీకులు వాళ్లకు తెలిసో తెలియకో శరీరానికి శక్తిని అందించే ఎన్నో పనులను వారు చేశారు. 

అందులో బియ్యాన్ని, పప్పులను నానబెట్టడం ఒకటి. అవును ఇలా చేయడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

24
బియ్యాన్ని ఎందుకు నానబెడతారు?

బియ్యాన్ని నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

బియ్యాన్ని నానబెట్టడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. బియ్యాన్ని నానబెట్టి కడిగితే కొవ్వు ఆమ్లాలు తొలగిపోతాయట. దీనివల్ల మర శరీరం కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్ వంటి మన శరీరానికి అవసరమైన పోషకాలను నిల్వ ఉంటాయి. 

ఇది కొంతమొత్తంలోనే పెరిగినా.. మన శరీరంలో ఎన్నో మార్పులు వస్తాయి. ఇది ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఇకపోతే బియ్యాన్ని నానబెట్టి వండితే రైస్ మెత్తగా కాకుండా అంటుకోకుండా ఉంటుంది. అలాగే అన్నం కూడా త్వరగా అవుతుంది.

34
పప్పును నానబెట్టడం వల్ల కలిగే ప్రయోజనాలు

చాలా మంది కందిపప్పు, శెనగపప్పులను బాగా కడిగేసి గంటపాటైనా నానబెట్టి ఆ తర్వాతే ఉడకబెడతారు. దీనివల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి తెలుసా? నిపుణుల ప్రకారం..కొంతమందికి కడుపు ఉబ్బరం వంటి జీర్ణసమస్యలు ఉంటాయి. ఇలాంటి వారికి ఈ పద్దతి ఉపయోగకరంగా ఉంటుంది. 

మీకు ఈ సమస్య రావొద్దంటే పప్పును నానబెట్టి ఉడికించి తినాలని నిపుణులు చెబుతున్నారు. పప్పును నానబెట్టి ఉడికించి తింటే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు అందుతాయి. అంతేకాకుండా పప్పు టేస్ట్ కూడా పెరుగుతుంది.

 అలాగే పప్పును ఇలా తినడం వల్ల పిల్లలకు, పెద్దలకు కడుపునకు సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అలాగే శరీరానికి అవసరమైన శోషణ మెరుగుపడుతుంది. అలాగే జీర్ణక్రియ మెరుగ్గా పనిచేస్తుంది. పప్పు కూడా తొందరగా ఉడుకుతుంది.

44
బియ్యం, పప్పులను ఎంతసేపు నానబెట్టాలి?

పప్పును, బియ్యానికి నానబెట్టి ఉడికించడం వల్ల మన శరీరానికి మంచి శక్తి లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగని బియ్యాన్ని, పప్పులను గంటలకు గంటలు నానబెట్టకూడదు. 

ఇలా చేస్తే గనుక వాటిలోని పోషకాలన్నీ తొలగిపోతాయి. బియ్యాన్ని నానబెట్టి 20 నుంచి 30 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి. ఇంత సమయం కంటే ఎక్కువ సేపు నానబెట్టకూడదు. ఇకపోతే పప్పును గంటకంటే ఎక్కువ సేపు నానబెట్టొచ్చు. 

అంటే శెనగపప్పును, కందిపప్పు వంటి ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే పప్పులను మాత్రమే ఎక్కువ సేపు నానబెట్టాలి. ఇలాంటి వాటిని రాత్రంతా నానబెట్టడం కూడా మంచిదే. అయితే వీటిని ఉడికించడానికి ముందు ఖచ్చితంగా కడగాలి.

Read more Photos on
click me!

Recommended Stories