Dosa Tips: దోశ పెనం కి అంటుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి?

Published : Aug 14, 2025, 05:56 PM IST

పర్ఫెక్ట్ దోశను వేయడం అంత ఈజీ కాదంటారు చాలా మంది. ఎందుకంటే వేసిన ప్రతి సారీ దోశ పెనానికి అంటుకుంటుంది. అయితే కొన్ని చిట్కాలతో దోశ పెనానికి అంటుకోకుండా చేయొచ్చు. అదెలాగంటే? 

PREV
15
dosa

మార్నింగ్ టిఫిన్ లో ఇడ్లీ, పూరీ, ఉప్మా, దోశ వంటివి చేసుకుని తింటుంటారు. అయితే చాలా మంది అన్నింటికంటే దోశలనే ఎక్కువ ఇష్టంగా తింటుంటారు. కానీ చాలా సార్లు దోశ పర్ఫెక్ట్ గా రాదు. అంటే దోశ పెనానికి అత్తుక్కుపోవడం, చిరిగిపోవడం వంటివి జరుగుతుంటాయి. మీరు గనుక కొన్ని చిట్కాలను పాటిస్తే మాత్రం మీ దోశ పెనానికి అతుక్కోకుండా క్రంచీగా కాలుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

25
dosa

క్రంచీ దోశ

టిఫిన్ వంటకాల్లో అందరికీ ఎక్కువగా ఇష్టమైన వంటకం ఏదైనా ఉందా అంటే అది దోశ అనే చెప్పాలి. అందుకే చాలా మంది ఇంట్లోనే కమ్మని దోశను చేసుకుని తింటుంటారు. అయితే చాలా సార్లు దోశ పెనానికి అతుక్కుపోతుంటుంది. లేదా చిరిగిపోతుంటుంది. ఇలా జరగకూడదంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

35
dosa

పెనాన్ని శుభ్రం చేయాలి

దోశను తయారుచేయడానికి ముందు పెనాన్ని బాగా శుభ్రం చేయండి. దానిపై దుమ్ము, ధూళి కణాలు లేకుండా నీళ్లతో శుభ్రంగా కడగలి. దోశ పెనం శుభ్రంగా ఉంటేనే దోశలు క్రంచీగా, చిరిగిపోకుండా వస్తాయి.

బంగాళాదుంప, ఉల్లిపాయ

పెనాన్ని శుభ్రం చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి వేడైన తర్వాత ఉల్లిపాయ లేదా బంగాళదుంపను తీసుకుని సగానికి కట్ చేయండి. దీన్ని నూనెలో ముంచి పెనంపై రుద్దండి.

45
dosa

దోశ పిండి

చాలా మంది దోశ పిండిని డైరెక్ట్ గా ఫ్రిజ్ లో నుంచి తీసిన వెంటనే దోశలు వేసేస్తుంటారు. కానీ ఇలా అస్సలు చేయకూడదు. దోశ పిండిని ఫ్రిజ్ లో గనుక పెడితే నేరుగా దోశలు వేయడానికి బదులు ఈ పిండిని 15 లేదా 20 నిమిషాలు బయట ఉంచాలి. ఆ తర్వాతే దోశలు వేయాలి.

55
dosa

నీళ్లు

దోశలు చిరిగిపోవడానికి ప్రధాన కారణం నీళ్లే. అవును దోశ పిండిలో నీళ్లను ఎక్కువగా కలిపితే అవి చిరిగిపోతాయి. అందుకే పిండిలో సరైన మోతాదులోనే నీళ్లను కలపండి.

నూనె

ఇకపోతే దోశ పిండిని పెనంపై పోసే ముందు ఖచ్చితంగా నూనె వేయాలి. ఇది దోశకు అంటుకునేలా ఉండాలి. అలా నూనెను పెనానికి రుద్దితే దోశ పెనానికి అంటుకోకుండా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories