Fish Eggs : చేప గుడ్లతో ఇన్ని హెల్త్ బెనిఫిట్సా..! టేస్ట్ కూడా చికెన్, మటన్, ఫిష్ కర్రీ కంటే బెస్ట్

Published : May 28, 2026, 07:17 PM IST

చేపల్ని తిన్నట్టే వాటి గుడ్లు తినడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిలో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. చేప గుడ్ల వల్ల కలిగే లాభాల గురించి తెలిస్తే వాటిని ఎవరూ వృథా చేయరు… లొట్టలేసుకుంటూ తింటారు. 

PREV
17
చేప గుడ్లతో హెల్త్ బెనిఫిట్స్..

Fish Eggs : మాంసాహారం తినే ప్రతిఒక్కరు కోడిగుడ్లను ఇష్టంగా తింటారు. కొన్ని ప్రాంతాల ప్రజలు బాతు, ఆస్ట్రిచ్ తో పాటు ఇతర పక్షుల గుడ్లను కూడా తింటుంటారు. చివరకు విషపూరితమైన పాముల గుడ్లను కూడా తినేవారు ఉన్నారు… ఈ విషయాలు అందరికి తెలిసినవే. అయితే చేపగుడ్లు కూడా తింటారని మీకు తెలుసా..? ఆసక్తిర విషయం ఏంటంటే చేప మాంసంలో కంటే ఎక్కువ పోషకాలు వాటి గుడ్లలో ఉంటాయట... వీటిని తింటే అనేక హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయట.

అయితే చేపల గుడ్లను సేకరించడం చాలా కష్టం... కాబట్టి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. కొన్ని చేపల గుడ్లు చాలా అరుదుగా లభిస్తాయి... అందుకే లక్షల ధర పలుకుతాయి. ఇంతకూ ఈ చేపల గుడ్లను తినడంవల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

27
చేప గుడ్లు.. మెదడుకు భలే మేలు

చేప గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఇలా చేప గుడ్లు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడమే కాకుండా, మెదడు చురుగ్గా పనిచేస్తుంది.

37
కళ్ల ఆరోగ్యానికి చేప గుడ్లు..

శరీరంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్ల లోపం కంటిచూపు సమస్యలకు దారితీస్తుంది. రోజూ చేప గుడ్లు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. భవిష్యత్ లో కంటి చూపు పాడవకుండా కాపాడుకోవాలంటే ముందు జాగ్రత్తగా చేప గుడ్లను తినడం మంచిది. 

47
చేప గుడ్లతో రక్తపోటు కంట్రోల్..

చేప గుడ్లలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లతో పాటు పొటాషియం కూడా ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. అంతేకాదు రక్తం గడ్డకట్టకుండా నివారిస్తుంది, శరీరంలోని అలర్జీలను కూడా తగ్గిస్తుంది.

57
చేప గుడ్లతో గుండెకు రక్షణ

శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చేప గుడ్లలోని ఒమేగా-3 కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ తగ్గితే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు ఉన్నవారు ఆహారంలో చేప గుడ్లను చేర్చుకుంటే మంచిది.

67
రోగనిరోధక శక్తికి చేప గుడ్లతో బూస్ట్

శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచే ఎన్నో పోషకాలు చేప గుడ్లలో ఉన్నాయి. వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల జబ్బుల బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. అనారోగ్యం బారినపడ్డవారు త్వరగా కోలుకునేందుకు కూడా ఈ చేప గుడ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. 

77
ఎముకలు, దంతాలకు చేప గుడ్లు బలం

పళ్లు, ఎముకల ఆరోగ్యానికి అవసరమైన మెగ్నీషియం, విటమిన్ డి, కాల్షియం, ఫాస్పరస్ వంటి పోషకాలు చేప గుడ్లలో లభిస్తాయి. ఇవి ఎముకల బలానికి, దంతాల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories