మన వంటల్లో ఎన్నో రకాల మసాలా దినుసులను వాడుతుంటాం. ఇవి ఫుడ్ రుచిని పెంచడమే కాకుండా.. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. నల్ల మిరియాలు, సెలేరి, జీలకర్ర, లవంగాలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందుతాం. ఈ మసాలా దినుసుల్లో సోంపు ఒకటి. సోంపును తినడం వల్ల మనం ఎన్నో బెనిఫిట్స్ ను పొందుతాం.
26
సోంపు
మనం హోటళ్లలో తిన్న తర్వాత సోంపును కూడా ఇస్తుంటారు. ఇది మౌత్ ఫ్రెషనర్ గా పనిచేస్తుంది. అలాగే తిన్నది బాగా జీర్ణమయ్యేందుకు సహాయపడుతుంది. సోంపులో పొటాషియం, కాల్షియం, ఐరన్ వంటి ఎన్నో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవన్నీ మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సోంపును ప్రతిరోజూ ఉదయాన్నే ఒక టీ స్పూన్ తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
36
సోంపును తినడం వల్ల కలిగే ప్రయోజనాలు
బరువు తగ్గుతారు
సోంపు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఈ మసాలా దినుసు జీవక్రియను పెంచడానికి సహాయపడుతుంది. దీంతో కొవ్వు కరిగే ప్రక్రియ పెరుగుతుంది. నిజానికి బరువు తగ్గాలనుకునేవారికి సోంపు ఒక వరమనే చెప్పాలి. మీరు బరువు తగ్గాలనుకుంటే ఖచ్చితంగా సోంపును తినండి.
46
ఉదర సమస్యలు తగ్గుతాయి
కడుపు ఉబ్బరం, నొప్పి వంటి సమస్యలు ఉన్నట్టైతే ప్రతిరోజూ పరిగడుపున టీ స్పూన్ సోంపును తినండి. ఈ సోంపు జీర్ణక్రియను సక్రియం చేస్తుంది. దీంతో కడుపు నొప్పి తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది.
56
గుండె ఆరోగ్యంగా ఉంటుంది
సోంపును రెగ్యులర్ గా పరగడుపున తింటే గుండె జబ్బులొచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సోంపులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది.దీంతో గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ
అధిక కొలెస్ట్రాల్ ఎన్నో రోగాలకు దారితీస్తుంది. అయితే మీరు ప్రతిరోజూ పరగడుపున సోంపును తింటే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది. సోంపులో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
66
రోగనిరోధక శక్తిని పెంచుతుంది
పోషకాలు పుష్కలంగా ఉండే సోంపులో విటమిన్ సి కూడా మెండుగా ఉంటుంది. మీరు గనుక సోంపును ప్రతి రోజూ పరిగడుపున తింటే మీ ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. దీంతో మీరు పదే పదే జబ్బు బారిన పడే అవకాశం ఉండదు. దగ్గు, జలుబు వంటి అనారోగ్యసమస్యలు రావు.