Cupcakes in Cooker: ఓవెన్ అవసరం లేదు.. కుక్కర్‌లోనే కప్ కేక్ ఇలా చేసేయండి

Published : Aug 13, 2025, 04:39 PM IST

పిల్లలకు కప్ కేక్స్ అంటే ఎంతో ఇష్టం. ప్రతిసారి బయటకొనే కన్నా మీరు ఇంట్లోనే వీటిని చేయవచ్చు. దీనికోసం ఓవెన్ అవసరం లేదు. కుక్కర్ లోనే కప్ కేక్ సులువుగా ఎలా చేయాలో తెలుసుకోండి. 

PREV
15
కప్ కేక్ కుక్కర్లో చేసేయండి

కప్ కేక్ పేరు చెబితేనే పిల్లలకు నోరూరిపోతుంది. పెద్దలకి కూడా ఇలాంటి బేకరీ ఐటమ్స్ అంటే ఎంతో ఇష్టం. కప్ కేకులు ప్రతిసారీ కొంటారు.. కానీ ఇంట్లో చేసేందుకు ప్రయత్నించరు. నిజానికి వీటిని ఇంట్లో చాలా సులువుగా చేసుకోవచ్చు. దీని కోసం ఓవెన్ కూడా అవసరం లేదు. కేవలం ఇంట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్ లోనే కప్ కేకులను వండుకోవచ్చు. వాటిని ఎలా చేయాలో తెలుసుకోండి.

25
కప్ కేక్ రెసిపీకి కావలసిన పదార్థాలు

కప్ కేక్ చేసేందుకు బటర్ పావు కప్పు తీసుకోండి. అలాగే కొన్ని చాక్లెట్ చిప్స్‌ని కూడా రెడీ చేసుకోండి. వెనిల్లా ఎసెన్స్ ఒక రెండు చుక్కలు ఉంటే సరిపోతుంది. పాలు ఒక కప్పు, నూనె పావు కప్పు తీసుకుని పక్కన పెట్టుకోండి. పంచదారను మిక్సీలో వేసి పొడి చేసి ఒక పావు కప్పు సిద్ధం చేసుకోండి. చిటికెడు ఉప్పును కూడా రెడీగా ఉంచుకోండి. కోకో పొడి పావు కప్పు, బేకింగ్ సోడా పావు స్పూను, బేకింగ్ పౌడర్ అర స్పూను సిద్ధంగా పెట్టుకోండి.

35
రెసిపీ ఇలా చేయండి

ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులో ఒక కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు మరొక గిన్నెను తీసుకొని అందులో మరిగించి చల్లార్చిన పాలు, పంచదార, వెనిలా ఎసెన్సు, నూనె వేసి బాగా గిలకొట్టండి. ఇందులో ముందుగా కలిపి పెట్టుకున్న కోకో పౌడర్ మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపండి. ఇది దోశె పిండిలాగా మరి మందంగా కాకుండా.. అలాగని పలుచగా కాకుండా రావాలి. మీకు కావాలనుకుంటే చాక్లెట్ చిప్స్ ని కూడా పైన చల్లుకోండి. లేదా ఇతర పిస్తా తురుము, బాదం తురుము కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కప్ కేక్ మౌల్డ్ ను తీసుకొని వాటిలో ఈ మిశ్రమాన్ని వేయండి. కుక్కర్లో ఈ కేక్ మౌల్డ్ ను పెట్టి కుక్కర్ మూత పెట్టేయండి. అయితే కుక్కర్ కు రబ్బరు, విజిల్ పెట్టాల్సిన అవసరం లేదు. మీడియం మంట మీద 45 నిమిషాలు పాటు ఉడికించండి.

45
చాక్లెట్ సిరప్ తో

ఆ తర్వాత స్టౌ ఆఫ్ చేసి మెల్లగా కప్ కేక్ మౌల్డ్‌ను బయటకు తీయండి. దీన్ని చల్లారే వరకు ఉంచండి. తర్వాత కప్ కేకులను తీస్తే టేస్టీగా సిద్ధమైపోయి ఉంటాయి. మీకు కావాలంటే దీనిపై క్రీమును వేసుకోవచ్చు. లేదా నేరుగా తినేయవచ్చు. లేదా కరిగించిన చాక్లెట్ ను పైన వేసుకొని తిన్నా టేస్టీగా ఉంటుంది. ఈ కుక్కర్లో కప్ కేకులు చేయడం చాలా సులువు.

55
ఓవెన్ లో కప్ కేకులు

మీ ఇంట్లో పిల్లల పుట్టిన రోజులు లేదా ఏదైనా వేడుకలు అయినప్పుడు మీరే సొంతంగా ఇలా కప్ కేకులు చేసి పెట్టండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. పైగా వీటిని చేయడం కూడా చాలా సులువు. కేవలం మిశ్రమాన్ని ఒక గిన్నెలో బాగా కలుపుకొని మౌల్డ్ లో వేసుకుంటే సరిపోతుంది. ఓవెన్ ఉన్నవారికి పని మరింత సులువు అయిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories