ఇడ్లీలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే చాలా మంది చేసిన ఇడ్లీలు చాలా గట్టిగా ఉంటాయి. మెత్తగా రావాలంటే ఏం చేయాలో తెలియదు. అయితే మీరు ఒక పద్దతిని ఫాలో అయితే మాత్రం ఇడ్లీలు మెత్తగా, సాఫ్ట్ గా వస్తాయి.
ఇంట్లో ప్రతి రోజూ ఏదో ఒక టిఫిన్ చేస్తూనే ఉంటారు. దోశ, పూరీ, పరోటా తో పాటుగా ఇడ్లీలను చేస్తుంటారు. అయితే చాలా తొందరగా అవుతుందని, అలాగే టేస్టీగా ఉంటాయని చాలా మంది ఇడ్లీలనే ఎక్కువగా చేస్తుంటారు. అయితే చాలా సార్లు మనం అనుకున్నట్టుగా ఇడ్లీలు రావు.
24
ఇడ్లీలు
అంటే గట్టిగా లేదా మరీ లూజ్ గా వస్తుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుందో కూడా తెలియదు. అయితే బియ్యం, మినపప్పును నానబెట్టేటప్పుడు అందులో ఒక పదార్థం వేస్తే ఇడ్లీలు చాలా మెత్తగా, సాఫ్ట్ గా వస్తాయి. మెత్తని ఇడ్లీలను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
34
మెత్తని ఇడ్లీలను తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు
మూడు కప్పుల రేషన్ బియ్యం, ఒక కప్పు మినపప్పు, కొన్ని మెంతులు, నాలుగు కప్పుల నీళ్లు. వీటన్నింటిని ఒక గిన్నెలో వేసి నాలుగైదు సార్లు నీళ్లు పోసి బాగా కడగాలి. దీనిలో నీళ్లు పోసి 5 గంటలు నానబెట్టాలి. నానబెట్టిన ఈ పదార్థాలను వేసి ఇడ్లీ పిండిలా కొంచెం గరుకుగా గ్రైండ్ చేసుకోవాలి.
44
ఇడ్లీలు
దీనిలో తగినంత ఉప్పు వేసి గాలి వెళ్లకుండా మూతపెట్టండి. రాత్రంతా దీన్ని అలాగే ఉంచితే ఉదయానికల్లా ఈ పిండి బాగా పులియబడుతుంది. దీంతో ఇడ్లీలు చాలా సాఫ్ట్ గా, మెత్తగా వస్తాయి. అంతే ఈ పిండితో ఇడ్లీలను తయారుచేయండి.