మండే ఎండల్లో రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగితే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 26, 2024, 2:03 PM IST

ఎండాకాలంలో చాలా మంది రెగ్యులర్ గా పెరుగును తినడమో, మజ్జిగను తాగడమో చేస్తుంటారు. ఎందుకంటే వీటిలో చలువ చేసే గుణాలు ఉంటాయి. అసలు ఎండాకాలంలో మజ్జిగను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

కాల్షియం

మన శరీరానికి కాల్షియం చాలా చాలా అవసరం. ముఖ్యంగా ఎముకల ఆరోగ్యానికి. మన  శరీరంలో తగినంత కాల్షియం ఉంటేనే ఎముకలు, దంతాలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. కాగా మజ్జిగలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల సమస్యలు రాకుండా చూస్తుంది. 
 

నిర్విషీకరణ

మన శరీరంలో విషాలు పేరుకుపోతాయి. దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అయితే రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగడం వల్ల మీ కాలేయం, శరీరంలోని విషయాలు బయటకు పోతాయి. దీంతో మీరు ఆరోగ్యంగా ఉంటారు. 

Latest Videos


ఉదర సమస్యలు

ఎండాకాలంలో చాలా మందికి ఉదర సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో మీరు రోజూ ఒక గ్లాసు మజ్జిగను తాగడం వల్ల బాడీ హీట్ తగ్గుతుంది. అలాగే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యల నుంచి ఉపశమనం కూడా లభిస్తుంది. 
 

Image: Getty Images

చర్మానికి మంచిది

మజ్జిగ మన చర్మానికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. మజ్జిగలో విటమిన్ సి, విటమిన్ బిలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా, షైనీగా ఉంచుతాయి. అలాగే చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. రోజూ మజ్జిగను తాగితే మీ చర్మ సమస్యలు తగ్గిపోతాయి. 
 

వెయిట్ లాస్

మజ్జిగను తాగితే మీరు బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది మీ ఆకలిని తగ్గిస్తుంది. అలాగే మీరు బరువు పెరగకుండా నియంత్రించడానికి కూడా సహాయపడుతుంది. 
 

butter milk

రక్తపోటును తగ్గిస్తుంది

అధిక రక్తపోటు చిన్న సమస్యేం కాదు. దీనివల్ల గుండెపోటు వస్తుంది. గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే దీన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే అధిక రక్తపోటు సమస్య ఉన్నవారు రోజూ ఒక గ్లాస్ మజ్జిగను తాగితే రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 
 

click me!