మనం రోజూ చాలా రకాల వంటలు చేస్తూ ఉంటాం. వాటిలో డీప్ ఫ్రైడ్ వంటలు కూడా ఉంటాయి. పూరీలు, గారెలు, బోండా, పునుగులు లాంటి రోజువారి చేసుకునే బ్రేక్ ఫాస్ట్ లు కూడా డీప్ ఫ్రై చేయాల్సినవే. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు అని తెలిసినా కూడా తినకుండా ఉండలేం కాబట్టి తింటూనే ఉంటాం. అయితే... వీటిని కుక్ చేసే సమయంలో చాలా మంది చాలా పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి.. ఏ పొరపాట్లు చేయకూడదో ఓసారి తెలుసుకుందాం..