రోజూ టమాటాలు తింటే ఏమౌతుందో తెలుసా?

First Published | Mar 24, 2024, 1:42 PM IST

ప్రతి ఒక్కరూ పప్పు నుంచి వంకాయ, బెండకాయ వంటి ప్రతి ఒక్క కూరలో టమాటాలను ఖచ్చితంగా వేస్తారు. కానీ టమాటాలను రోజూ తినొచ్చా? తింటే ఏమౌతుందో తెలుసా?
 

మిగతా కూరగాయల మాదిరిగానే టమాటాలు కూడా ఎన్నో పోషకాలున్న కూరగాయ. టమాటాల్లో బీటా కెరోటిన్, లైకోపీన్, విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలున్న టమాటాలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. టమాటాల్లో ఉండే పోషకాలు గుండె జబ్బులు, న్యూరోడెజెనరేటివ్ డిసీజ్, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్నిచాలా వరకు తగ్గిస్తాయని పలు పరిశోధనల్లో తేలింది.
 

Image: Freepik

టమాటాలను తింటే రోగనిరోధక శక్తి మెరుగపడుతుంది. అలాగే టమాటా రసంలో వైరస్ నిరోధకత లక్షణాలు ఉంటాయి. ఇది రోగనిరోధక కణాల మొత్తాన్ని బాగా పెంచుతుందని చాలా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా టమాటాల్లో ఉండే బీటా కెరోటిన్, లైకోపీన్ అనే మరో యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ కణాలను నాశనం చేస్తాయి. అంటే టమాటాలను తింటే క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరక తగ్గుతుంది. 

Latest Videos


Tomatoes

టమాటాలను బాగా  తినే పురుషులకు ప్రోస్టేట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఎన్నో అధ్యయనాలు కనుగొన్నాయి. టమాటాలు వంటి కూరగాయలు ఈస్ట్రోజెన్ రిసెప్టర్-నెగటివ్ రొమ్ము కణితులు, పెద్దప్రేగు, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే  ప్రమాదాన్ని తగ్గిస్తాయి. 
 

Tomatoes


టమాటాలు ఎక్కువగా ఉండే ఆహారం గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా చాలా వరకు తగ్గిస్తుందని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. టమాటాల్లో లైకోపీన్ అనే సమ్మేళనం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది మన గుండెను రక్షిస్తుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. టమాటా రసం రక్తంలో, స్పెర్మ్ కదలికలో లైకోపీన్ స్థాయిలను బాగాపెంచిందని అధ్యయనాలు చెబుతున్నాయి.
 

Tomatoes

టమాటాల్లో కరగని,  కరగని ఫైబర్లు పుష్కలంగా ఉంటాయి. టమాటాల్లో సెల్యులోజ్, హెమిసెల్యులోజ్, పెక్టిన్ ఫైబర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి ఎన్నో  జీర్ణ సమస్యలను తగ్గిస్తాయి. 

యు.ఎస్. లో.. పెద్దలలో 15 శాతం మందికి డయాబెటిస్ ఉంది. 38 శాతం మంది పెద్దలకు ప్రీ డయాబెటిస్ ఉందని తాజా అధ్యయనంలో తేలింది. అయితే  లైకోపీన్ అనే సమ్మేళనం టైప్ 2 డయాబెటిస్ ను నివారించగలదని కొన్ని ఆధారాలు సూచిస్తున్నాయి. అంటే టమాటాలు డయాబెటీస్ రాకుండా చేయగలవని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

click me!