Health: చికెన్‌లో ఈ పార్ట్స్ అస్స‌లు తిన‌కండి.. ఆరోగ్యానికి మంచిది కాదు.

Published : Feb 11, 2026, 06:15 PM IST

Health: చికెన్‌లో పుష్క‌ల‌మైన‌ ప్రోటీన్ ఉంటుంది. కోడిలో ప్రతి భాగం ఆరోగ్యానికి మంచిదనే భావన తప్పు. కొన్ని భాగాల్లో అధిక కొవ్వు, బ్యాక్టీరియా ఉంటాయి. ఇవి ఆరోగ్యంపై ప్ర‌తికూల ప్ర‌భావం చూపుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
ఎక్కువ కొవ్వు ఉండే భాగాలు

చికెన్ చర్మం (Skin):

క్రిస్పీగా వండిన చికెన్ స్కిన్ చాలామందికి ఇష్టం. కానీ ఇందులో అధిక కొవ్వు ఉంటుంది. తరచుగా తింటే కొలెస్ట్రాల్ పెరగడం, గుండె సంబంధిత సమస్యల ప్రమాదం ఉంటుంది. సరిగా వండకపోతే బ్యాక్టీరియా కూడా మిగిలే అవకాశం ఉంది.

వింగ్ టిప్స్:

ఇవి ఎక్కువగా ఎముకలు, చర్మంతో ఉంటాయి. పోషకాలు తక్కువ. కొవ్వు ప్రమాదం మాత్రం ఉంటుంది.

25
బ్యాక్టీరియా ఎక్కువగా ఉండే భాగాలు

పేగులు (Intestines):

పేగుల్లో సహజంగానే చాలా బ్యాక్టీరియా ఉంటాయి. ఎంత శుభ్రం చేసినా పూర్తిగా తొలగించడం కష్టం. సరైన విధంగా శుభ్రం చేయకపోతే ఫుడ్ పాయిజనింగ్ ప్రమాదం ఉంటుంది. అందుకే పేగుల‌ను అస్స‌ల‌ను తీసుకోకూడ‌దు.

మెడ (Neck):

చికెన్ మెడ‌ను అస్స‌లు తీసుకోకూడ‌దు. మెడ భాగంలో బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది.

కాళ్లు (Feet):

కోడి కాళ్లు నేలతో ఎక్కువసేపు తగులుతాయి. అందుకే మట్టి, క్రిములు ఉండే ప్రమాదం ఉంటుంది. ఒక‌వేళ వండుకున్నా ముందు బాగా శుభ్రం చేయాలి.

35
టాక్సిన్లు చేరే అవకాశం ఉన్న భాగాలు

తల (Head):

కొన్ని ప్రాంతాల్లో సూప్‌లలో త‌ల‌ను వాడుతారు. కానీ కోడి తిన్న ఆహారం, వాతావరణం వల్ల పురుగుమందుల అవశేషాలు నిల్వ ఉండే అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఇవి ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.

45
ఈ పార్ట్స్ విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

లంగ్స్ (Lungs):

చాలా మంది కోడిలో చెస్ట్ భాగాన్ని తింటుంటారు. కానీ ఈ భాగంలో సూక్ష్మజీవులు, పరాన్నజీవులు ఉండే ప్రమాదం ఉంది. పూర్తిగా వండినా కొన్ని జీవులు తట్టుకునే అవకాశం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

గిజార్డ్ (Gizzard):

ఇది కోడి కడుపు భాగం. ఇందులో చిన్న రాళ్లు, మట్టి ఉండవచ్చు. బాగా శుభ్రం చేసి వండాలి.

55
ఎలా సురక్షితంగా తినాలి?

ఎప్పుడూ తాజా చికెన్ మాత్రమే కొనాలి. ముడి చికెన్‌ను ఇతర ఆహారాలతో కలపకూడదు. కనీసం 75°C పైగా ఉష్ణోగ్రతలో పూర్తిగా వండాలి. శుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి. అనుమానం ఉన్న భాగాల కంటే లీన్ మీట్ భాగాలు (బ్రెస్ట్ పీస్ వంటి) ఎంచుకోవడం మంచిది. చికెన్ సాధారణంగా సురక్షితమైన ఆహారం. కానీ సరైన భాగాలు ఎంచుకుని, శుభ్రంగా వండి తింటేనే ఆరోగ్య ప్రయోజనం ఉంటుంది. Salmonella, Campylobacter వంటి బ్యాక్టీరియా ఫుడ్ పాయిజనింగ్‌కు కారణం అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories