నల్ల ద్రాక్ష Vs ఆకు పచ్చ ద్రాక్ష..
ఈ రెండు రకాల ద్రాక్ష పండ్ల్లోనూ విటమిన్ సి, విటమిన్ కె, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నల్ల ద్రాక్షలో ఆంథోసయనినట్లు, రెస్వెరాట్రాల్ వంటి మరింత శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. యవ్వనంగా కనిపించేలా చేయడంలోనూ హెల్ప్ చేస్తాయి. మరోవైపు, పచ్చ ద్రాక్ష పండ్లలో కేలరీలు, చక్కెర కొద్దిగా తక్కువగా ఉంటాయి. కాబట్టి, బరువు తగ్గాలి అనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్.
యాంటీ ఆక్సిడెంట్లు...
నల్ల ద్రాక్షలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ ద్రాక్షలో ఆంథోసయనిన్ సమ్మేళనాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపును తగ్గించడంలో, గుండె సంబంధిత సమస్యలు తగ్గించడానికి సహాయపడతాయి. నల్ల ద్రాక్షలో ఉండే రెస్వెరాట్రాల్.. గుండె ఆరోగ్యానికి సహాయపడి.. ఆయుష్షు పెంచడానికి హెల్ప్ చేస్తాయి.
రుచి, ఆకృతి...
పచ్చ ద్రాక్ష సాధారణంగా గట్టిగా, తినడానికి అనువుగా, కొద్దిగా పుల్లగా, తియ్యగా ఉంటాయి. ఇవి సలాడ్లు, స్నాక్స్ కి బాగుంటాయి. అయితే, నల్ల ద్రాక్ష తియ్యగా,మృదువుగా ఉంటాయి. డెజెర్ట్స్ , ఇతర వంటలకు, జ్యూస్ కి అనుకూలంగా ఉంటాయి.
విటమిన్ సి...
ఈ రెండు రకాల ద్రాక్షల్లో విటమిన్ సి ఉండటం వల్ల చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. అయితే, నల్ల ద్రాక్షలో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్రీ రాడికల్స్ తో పోరాడటానికి, చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇవి చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా, యవ్వనంగా కనిపించేలా చేస్తాయి.
జీర్ణక్రియ, హైడ్రేషన్..
ద్రాక్ష పండ్లలో నీరు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు సహాయపడి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. పచ్చ ద్రాక్ష తినప్పుడు మీ కడుపు తేలికగా అనిపించొచ్చు. నల్ల ద్రాక్షలో ఫైబర్, పోషకాలు ఎక్కువగా ఉంటాయి.