Curd: పెరుగు నీళ్లలా ఉంటే తినడం ఎవరికీ నచ్చదు. అలా కాకుండా జున్నులా గడ్డలా ఉంటే కమ్మగా ఉంటుంది. తినడానికి కూడా బాగుంటుంది. అయితే.. పెరుగు అలా గడ్డలా తోడుకోవాలంటే సింపుల్ చిట్కాలు ఫాలో అవ్వాల్సిందే…
గడ్డ పెరుగు నచ్చని వాళ్లు ఎవరైనా ఉంటారా? కానీ.. ఎంత చిక్కటి పాలు కొన్నా కూడా.. పెరుగు నీళ్లలా మారుతుందని.. అస్సలు రుచిగా ఉండటం లేదని ఫీలయ్యేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. మీ పాలు ఎలా ఉన్నా గడ్డలా పెరుగు తోడుకుంటుంది. మరి.. ఆ సింపుల్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…
24
గడ్డ పెరుగు సీక్రెట్ టిప్..
సోషల్ మీడియాలో రవిచంద్రన్ హెడ్డే అని వ్యక్తి.. గడ్డ పెరుగు సీక్రెట్ ని పంచుకున్నారు. మనం పాలు కాచి.. తోడు వేసేటప్పుడు.. ఓ చిన్న అరటి ముక్కను కూడా ఆ పాలల్లో వేయాలి. మరసటి రోజు ఉదయాన్నే మీరు ఆ పాలను చూస్తే.. గట్టిగా గడ్డలాగా పెరుగు తోడుకుంటుంది. అచ్చం జున్ను తిన్న ఫీలింగ్ కలుగుతుంది. అంతేకాదు.. ఆ పెరుగు చాలా రుచిగా, తియ్యగా కూడా ఉంటుంది.
34
రోజూ అరటి ఆకు వేయాల్సిన అవసరం లేదు..
ఒక్కసారి పెరుగు గడ్డగా తోడుకున్న తర్వాత.. మరుసటి రోజు పాలల్లో అరటి ఆకు వేయాల్సిన అవసరం లేదు. గడ్డలాగా తోడుకున్న పెరుగుతో పాలకు తోడు వేస్తే సరిపోతుంది. మళ్లీ,. ఎప్పుడైనా పాలు సరిగా తోడుకోలేదు అనిపించినప్పుడు.. మళ్లీ అరటి ఆకు వేస్తే సరిపోతుంది. దీని వల్ల పెరుగు ఎండాకాలంలో కూడా తొందరగా పుల్లగా మారదు. చాలా రుచిగా ఉంటుంది.
పాలు తోడు పెట్టేటప్పుడు అరటి ఆకు ముక్క వేయడం వల్ల పెరుగు గట్టిగా, రుచిగా వస్తుంది. ఇది పాలు బాగా గడ్డకట్టడానికి సహాయపడుతుంది. అంతేకాదు, పెరుగుకు ఒక ప్రత్యేకమైన సువాసనను కూడా ఇస్తుంది. అరటి ఆకులోని గుణాలు పాలను గట్టిగా మార్చడంలో సాయపడతాయి.