Dosa: టిఫిన్ తినమంటే పిల్లలు వంకలు పెడుతుంటారు. కూరగాయలు కనిపిస్తే చాలు ప్లేట్ పక్కన పెట్టేస్తారు. వాళ్లకు తెలియకుండానే పోషకాలను అందిస్తూ నచ్చే బ్రేక్‌ఫాస్ట్ ఎలా తయారు చేయాలనుకుంటున్నారా? అయితే ఈ రెయిన్ బో దోశలు ట్రై చేయండి. ప్లేట్ ఖాళీ చేయడం పక్కా.
పిల్లల కోసం కలర్ ఫుల్ దోశలు..ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే
ఈ వెరైటీ రెయిున్ బో దోశెలు ట్రై చేస్తే…పిల్లలు ఎగిరి గంతేస్తారు. పోటీపడి మరి తింటారు. దీంతో పిల్లలు కడుపునిండా తింటారు. ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానూ. ఆ కలర్సే ఎట్రాక్టివ్‍గా కనిపిస్తాయి కాబట్టి…ఏమాత్రం బెట్టు చేయకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు.
26
క్యారెట్ దోశ
క్యారెట్ లోని తీపిదనం దోశకు అదనపు రుచిని ఇస్తుంది. క్యారెట్‌ను తురిమి లేదా ఉడికించి మెత్తని పేస్ట్ లా చేసి పిండిలో కలపండి. క్యారెట్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
36
బీట్‌రూట్ దోశ
బీట్‌రూట్ అంటే చాలా మంది పిల్లలకు అస్సలు ఇష్టం ఉండదు. బీట్ రూట్ కలర్ పింక్ అంటే మాత్రం పిల్లలకు మహా ప్రాణం. ఒక చిన్న బీట్‌రూట్ ముక్కను ఉడికించి మెత్తగా గ్రైండ్ చేయండి. ఆ పేస్ట్‌ను దోశ పిండిలో కలిపితే పిండి పింక్ కలర్‍లోకి మారుతుంది. ఇందులో ఉండే ఐరన్, ఫోలిక్ యాసిడ్ పిల్లల్లో రక్తహీనతను తగ్గిస్తాయి.
పసుపు రంగులో ఉండే దోశలు పిల్లలను త్వరగా ఆకర్షిస్తాయి. పెసరపప్పుతో చేసిన పిండిని వాడొచ్చు లేదా పిండిలో చిటికెడు పసుపు కలిపినా సరిపోతుంది. పసుపు సహజమైన యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది, పెసరపప్పు ద్వారా మంచి ప్రోటీన్ అందుతుంది.
56
పాలకూర దోశ
ఆకుకూరలు తినడానికి మారాం చేసే పిల్లలకు ఇది ఒక బెస్ట్ ఆప్షన్. పాలకూర ఆకులను వేడి నీళ్లలో వేసి తీసి, అల్లం, పచ్చిమిర్చితో కలిపి పేస్ట్ చేయండి. దీన్ని పిండిలో కలిపితే గ్రీన్ కలర్ దోశలు రెడీ. కంటి చూపు మెరుగుపడటానికి, ఎముకల పుష్టికి అవసరమైన విటమిన్ A, కాల్షియం ఇందులో పుష్కలంగా ఉంటాయి.
66
అద్భుతంగా పనిచేసే 'కలర్ ఫుల్' ట్రిక్
అంతేకాకుండా ఇలా కూడా ట్రై చేయండి. దోశను చిన్న చిన్న గుంట పునుగుల పెనంపై వేసి 'మినీ దోశలు'గా లేదా 'హార్ట్ షేప్'లో వేసి ఇవ్వండి. దోశ వేసిన తర్వాత దాని పైన కొద్దిగా తురిమిన చీజ్ లేదా పనీర్ చల్లితే, పిల్లలు దాన్ని పిజ్జాలా ఫీల్ అయి ఇష్టంగా తింటారు. చట్నీ లేదా సాస్‌తో దోశ పైన స్మైలీ బొమ్మలు గీసి ఇస్తే వాళ్ల ఆనందానికి అవధులు ఉండవు.
పిల్లల విషయంలో ఈ 'కలర్ ఫుల్' ట్రిక్ అద్భుతంగా పనిచేస్తుంది. రేపు ఉదయం మీ ఇంట్లో కూడా ఈ రెయిన్ బో దోశలను ట్రై చేసి, మీ పిల్లలకివ్వండి.