Tamarind: అమ్మమ్మలనాటి చిట్కా, ఇదొక్కటి చేస్తే చింతపండు సంవత్సరమైనా పాడవ్వదు, రంగు మారదు

Published : May 22, 2026, 05:22 PM IST

Tamarind:  మనం చేసే చాలా రకాల వంటలకు చింతపండు మంచి రుచిని అందిస్తుంది. మరి అలాంటి చింత పండు సంవత్సరం పాటు పాడవ్వకుండా తాజాగా, రంగు మారకుండా, పురుగు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? 

PREV
16
చింతపండు...

మనం రెగ్యులర్ గా చేసే  చాలా రకాల వంటలకు చింతపండు చాలా అవసరం. ముఖ్యంగా సాంబారు, పప్పు చారు, రసం, చట్నీ అన్నింటిలోనూ చింత పండు పడితేనే రుచి వస్తుంది.  ఇది కేవలం రచి ని మాత్రమేకాదు.. ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మరి, అలాంటి చింతపండును మనం ఒక్కసారి నిల్వ చేస్తే…  సంవత్సరం పాటు ఎలాంటి పురుగు పట్టకుండా, కలర్ మారకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…

26
చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు...

ప్రతి సంవత్సరం చింతపండు సీజన్ రాగానే , చాలా మంది గృహిణిలు ఏడాదికి సరిపడా కొని నిల్వ చేసుకుంటూ ఉంటారు. కానీ, సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే ఆ చింతపండుకు తొందరగా పురుగు పడుతుంది. లేదంటే నల్లగా మారుతుంది. రుచి కూడా మారిపోతుంది. అయితే… కొన్ని సింపుల్ చిట్కాలు ఫాలో అయితే.. ఏడాది అయినా చింతపండు పాడవ్వదు.

36
ఎండబెట్టడం చాలా ముఖ్యం!
చింతపండును నిల్వ చేసే ముందు, దాన్ని శుభ్రం చేయడం చాలా ముఖ్యం. కొత్త చింతపండులో గింజలు, నార, పైపొట్టు ఉంటాయి. ఇవి ఉంటే పురుగు పట్టే అవకాశం ఎక్కువ. అందుకే, వాటన్నింటినీ పూర్తిగా తీసేసి శుభ్రం చేయాలి. కొత్త చింతపండులో తేమ ఉంటుంది. ఆ తేమ అలాగే ఉంటే బూజు వస్తుంది. అందుకే చింతపండును ఒక రోజంతా ఎండలో బాగా ఎండబెట్టాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న తేమ పోయి, ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
46
ఉప్పుతో భద్రపరచండి..
చింతపండు పాడవకుండా ఉండటానికి మన పెద్దలు వాడిన అత్యంత ప్రభావవంతమైన పద్ధతి 'కల్లుప్పు'. చింతపండును నిల్వ చేసే గాజు సీసా లేదా జాడీ అడుగున మొదట కొంచెం కల్లుప్పు వేయాలి. దానిపై ఒక పొర చింతపండు పెట్టి, మళ్లీ మధ్యలో కొంచెం కల్లుప్పు చల్లాలి. ఇలా పొరలు పొరలుగా ఉప్పు వేయడం వల్ల చింతపండు చెడిపోకుండా, రుచి మారకుండా ఉంటుంది.
56
స్టీల్ డబ్బాలు వద్దు!
చింతపండు నిల్వ చేయడానికి గాజు సీసాలు లేదా పింగాణీ జాడీలు మాత్రమే ఉత్తమం. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ లేదా అల్యూమినియం డబ్బాలు వాడకూడదు. ఎందుకంటే, చింతపండులోని పులుపు (ఆమ్ల గుణం) ఆ లోహాలతో రసాయనిక చర్య జరిపి, విషపూరితం అయ్యే ప్రమాదం ఉంది. ప్లాస్టిక్ డబ్బాల కన్నా పింగాణీ జాడీలు చింతపండుకు సహజమైన వాతావరణాన్ని అందించి, దాని రంగు, రుచిని కాపాడతాయి.
66
రోజువారీ వాడకం

చింతపండుకు తేమ తగిలితే నల్లగా మారుతుంది. జాడీని పదేపదే తెరవడం వల్ల గాలి లోపలికి వెళ్లి త్వరగా పాడవుతుంది. అందుకే, వంట కోసం రోజూ వాడటానికి, ఒక నెలకు సరిపడా చింతపండును చిన్న డబ్బాలో విడిగా తీసి పెట్టుకోండి. దీనివల్ల పెద్ద జాడీని తరచుగా తెరవాల్సిన అవసరం ఉండదు. వీలైతే, చింతపండును జిప్‌లాక్ కవర్లలో వేసి ఫ్రిజ్‌లో పెడితే, ఏడాది పొడవునా కొత్తదానిలా రంగు మారకుండా తాజాగా ఉంటుంది.

చివరగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, చింతపండును నిల్వ చేయడం కూడా ఒక కళ. సరైన జాగ్రత్తలు తీసుకుంటే, మన వంటగదిలో రుచికి, ఆరోగ్యానికి ఎలాంటి లోటూ ఉండదు. అమ్మమ్మ కాలం నాటి ఈ చిట్కాలను పాటిస్తూ, మీ చింతపండును ఏడాది పొడవునా భద్రంగా కాపాడుకోండి!

Read more Photos on
click me!

Recommended Stories