Tarbooj Barfi: వాట‌ర్‌మిలాన్‌తో రుచిక‌ర‌మైన‌ బ‌ర్ఫీ... క‌చ్చితంగా ట్రై చేయాల్సిందే

Published : May 22, 2026, 08:03 AM IST

Tarbooj Barfi: స‌మ్మ‌ర్‌లో క‌నిపించే పండ్ల‌లో పుచ్చ‌కాయ ఒక‌టి. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పండును సాధారణంగా పుచ్చకాయను ముక్కలుగా, జ్యూస్‌గా లేదా షేక్ రూపంలో తీసుకుంటారు. అయితే ఇదే పండుతో ఎంతో రుచికరమైన బర్ఫీ కూడా చేసుకోవ‌చ్చ‌ని తెలుసా.? 

PREV
15
పుచ్చకాయ బర్ఫీ ప్రత్యేకత ఏంటి?

పుచ్చకాయతో తయారయ్యే ఈ బర్ఫీ సాధారణ స్వీట్లతో పోలిస్తే భిన్నమైన రుచిని అందిస్తుంది. పండులో ఉండే సహజమైన తీపి, సువాసన బర్ఫీలోనూ అలాగే నిలిచి ఉంటుంది. తేలికగా జీర్ణమవడమే కాకుండా వేసవిలో చల్లదనాన్ని కూడా ఇస్తుంది.

25
తయారీకి కావాల్సిన పదార్థాలు

* పుచ్చకాయ ముక్కలు – 3 కప్పులు (గింజలు తీసినవి)

* పాలు – 1 లీటర్

* చక్కెర – అర కప్పు (రుచికి స‌రిప‌డ‌)

* నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు

* కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్లు

* యాలకుల పొడి – అర టీ స్పూన్

* పిస్తా, బాదం ముక్కలు – అలంకరణ కోసం

35
పుచ్చకాయ బర్ఫీ తయారీ విధానం

ముందుగా పుచ్చకాయ ముక్కలను మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దానిని వడగట్టి అదనపు నీరు, పీచు భాగాలను తొలగించాలి. ఇప్పుడు మందపాటి పాత్రలో పాలను పోసి మధ్యస్థ మంటపై మరిగించాలి. పాలు సగానికి తగ్గే వరకు కలుపుతూ ఉడికించాలి. అనంతరం పుచ్చకాయ ప్యూరీని పాలలో వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై నిరంతరం కలుపుతూ ఉడికించాలి. కొద్దిసేపటి తర్వాత చక్కెర, యాలకుల పొడి వేసి కలపాలి. మరోవైపు కార్న్ ఫ్లోర్‌లో కొద్దిగా నీరు కలిపి ముద్దలు లేకుండా ద్రావణం తయారు చేసి మిశ్రమంలో పోయాలి. మిశ్రమం చిక్కబడుతూ కోవా మాదిరి దట్టంగా మారిన తర్వాత నెయ్యి వేసి మరో రెండు నుంచి మూడు నిమిషాలు ఉడికించాలి. పాత్ర అంచుల నుంచి మిశ్రమం విడిపోతూ వస్తే స్టవ్ ఆఫ్ చేయాలి.

45
సెట్ చేసే విధానం

ఒక ప్లేట్ లేదా ట్రేకు నెయ్యి రాసి సిద్ధం చేసుకోవాలి. తయారైన మిశ్రమాన్ని అందులో సమానంగా పరచాలి. పైభాగంలో పిస్తా, బాదం ముక్కలు చల్లి స్వల్పంగా నొక్కాలి. ముందుగా గది ఉష్ణోగ్రత వద్ద చల్లారనివ్వాలి. ఆ తర్వాత ఫ్రిజ్‌లో ఒకటి నుంచి రెండు గంటల పాటు ఉంచాలి. బాగా సెట్ అయిన తర్వాత మీకు నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవచ్చు.

55
వడ్డించే ముందు గుర్తుంచుకోవాల్సిన సూచనలు

మరింత రుచికోసం కొద్దిగా కుంకుమపువ్వు కూడా కలపవచ్చు. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండటంతో ప్యూరీని వడగట్టడం తప్పనిసరి. ఫ్రిజ్‌లో చల్లగా ఉంచి వడ్డిస్తే రుచి మరింత పెరుగుతుంది. పుచ్చకాయతో జ్యూస్, షేక్‌లే కాదు.. ఇలా బర్ఫీ కూడా తయారు చేసుకోవ‌చ్చు.

Read more Photos on
click me!

Recommended Stories