Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ 5 రకాల ఆహారాలను అస్సలు వండకూడదు తెలుసా?

Published : Apr 11, 2025, 03:36 PM IST

ప్రెషర్ కుక్కర్ గురించి తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ఆడవాళ్లను కదిలిస్తే.. ప్రెషర్ కుక్కర్ వల్ల వారికి ఎంత టైం సేవ్ అవుతుందో ఆపకుండా చెబుతారు. ప్రస్తుతం అంతలా పెరిగిపోయంది ప్రెషర్ కుక్కర్ వాడకం. ఇది గ్యాస్ తో పాటు టైం కూడా సేవ్ చేస్తుంది కాబట్టి చాలామంది ప్రెషర్ కుక్కర్ ను వాడటానికి ఇష్టపడతారు. నార్మల్ పాత్రలతో పోలిస్తే.. ప్రెషర్ కుక్కర్ లో చాలా ఫాస్ట్ గా వంట అయిపోతుంది. దీంట్లో వంట చేయడం సులభమే అయినప్పటికీ.. కొన్ని రకాల వంటలు అస్సలు చేయకూడదట. ఎందుకు చేయకూడదు? చేస్తే ఏమవుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

PREV
16
Pressure Cooker: ప్రెషర్ కుక్కర్‌లో ఈ 5 రకాల ఆహారాలను అస్సలు వండకూడదు తెలుసా?

ప్రస్తుతం కుక్కర్ల వాడకం బాగా పెరిగిపోయింది. బిజీ లైఫ్ కారణంగా చాలామందికి కుక్కర్‌లో వంట చేయడం అలవాటైపోయింది. కుక్కర్‌ వంట పనిని కాస్త ఈజీ చేసింది. అయితే ప్రెషర్ కుక్కర్ లో కొన్ని ఆహారాలను వండుకొని తినడం మంచిది కాదంటున్నారు నిపుణులు. దీనివల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని చెబుతున్నారు. మరి ఎలాంటి ఆహారాలను కుక్కర్‌లో వండకూడదో ఇక్కడ తెలుసుకుందాం.

26
ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలు

పాల ఉత్పత్తులు

నిపుణుల ప్రకారం పాల ఉత్పత్తులను ఎప్పుడూ కుక్కర్‌లో వండి తినకూడదు. దీనివల్ల వండిన ఆహారం రుచి మారిపోతుంది. కొన్నిసార్లు అది పాడైపోతుంది. పాల ఉత్పత్తులను కుక్కర్‌లో వండితే ఆరోగ్యానికి హానికరం.

36
ఆకుకూరలు

పాలకూర, బ్రోకలీ, క్యాబేజీ వంటి కొన్ని ఆకుకూరలను ఎప్పుడూ కుక్కర్‌లో వండకూడదు. వీటిని కుక్కర్‌లో వండితే వాటి రుచి మారిపోతుంది, వాటిలోని పోషకాలు కూడా పోతాయని నిపుణులు చెబుతున్నారు.

46
పాస్తా

కుక్కర్‌లో పాస్తా వంటి ఆహారాలను వండకూడదని నిపుణులు చెబుతున్నారు. రుచి మారడంతో పాటు ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుందని అంటున్నారు. అంతేకాదు కుక్కర్ లో వండేటప్పుడు నీరు త్వరగా పీల్చుకుని అవి ఒకదానికొకటి అంటుకుంటాయట.

56
మెత్తని కూరగాయలు

దోసకాయ, క్యాప్సికమ్ వంటి మెత్తని కూరగాయలను కుక్కర్‌లో వండకూడదు. ఇవి మెత్తగా ఉంటాయి కాబట్టి కుక్కర్‌లో వండేటప్పుడు త్వరగా ఉడికిపోతాయి. వాటి రుచి కూడా మారిపోతుంది.

66
ధాన్యాలు

బార్లీ, క్వినోవా వంటి ధాన్యాలను కుక్కర్‌లో వండితే అవి మెత్తగా మారి వాటి స్వభావాన్ని కోల్పోతాయి. కాబట్టి వాటిని ఎప్పుడూ కుక్కర్‌లో వండకూడదు. బదులుగా ఒక గిన్నెలో వండటం మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories