వీటిని తింటే తలనొప్పి వస్తుంది జాగ్రత్త..

First Published | Jun 5, 2023, 2:03 PM IST

కొంతమందికి కొన్ని ఆహారాలను తింటే వెంటనే తలనొప్పి వస్తుంది. లేదా తలనొప్పిని పెట్టుకుని వీటిని తిన్నా ఉన్న తలనొప్పి ఇంకా పెరుగుతుంది.
 

Migraine

తలనొప్పి రాని వారుండరు. నిజానికి తలనొప్పి రావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. దీనికి చికిత్స అవసరం. కానీ విశ్రాంతి తీసుకుంటే తలనొప్పి దానంతట అదే తగ్గిపోతుంది. కానీ మైగ్రేన్ నొప్పి అంత సులువుగా తగ్గదు. మైగ్రేన్ వల్ల భరించలేని నొప్పి వస్తుంది. వెళుతురును చూడటంలో ఇబ్బంది, పెద్ద పెద్ద శబ్దాలను వినాలనిపించకపోవడం, వాంతులు మైగ్రేన్ లక్షణాలు. 

కొంతమందికి కొన్ని ఆహారాలను తినడం వల్ల మైగ్రేన్ నొప్పి వస్తుంది. లేదంటే ఉన్న తలనొప్పి ఇంకా ఎక్కువవుతుంది. అసలు ఎలాంటి ఆహారాలను తలనొప్పిని, మైగ్రేషన్ నొప్పిని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 


కాఫీ

కాఫీ తక్షణమే ఎనర్జీని పెంచుతుంది. కానీ ఇది మన ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కొంతమందికి కాఫీని ఎక్కువ తాగితే తలనొప్పి వస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ తలనొప్పిని పెంచుతుంది.

కృత్రిమ స్వీటెనర్లు 

కృత్రిమ స్వీటెనర్లు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటిని తీసుకుంటే కూడా తలనొప్పి బాగా పెరుగుతుంది. తలనొప్పి ఉన్నవారు స్వీట్లను మితంగా మాత్రమే తినాలి.
 

మద్యాపానం

మైగ్రేన్ తలనొప్పికి మందు కూడా ఒక కారణమేనంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం వల్ల మైగ్రేన్ నొప్పి పెరుగుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. 

ఉప్పుగా ఉండే ఆహారాలు

కారం, ఉప్పుగా ఉండే ఆహారాలను తింటే కూడా కొంతమందికి మైగ్రేన్ నొప్పి, తలనొప్పి వస్తుంది. ఎప్పుడూ తలనొప్పి వచ్చేవారు ఊర గాయలకు తినడం పూర్తిగా మానేయాలి. 
 

చాక్లెట్లు

డార్క్ చాక్లెట్లతో ఎన్నో లాభాలున్నాయి. కానీ వీటిని మితంగానే తినాలి. లేదంటే ఎన్నో సమస్యలు వస్తాయి. వీటిలో తలనొప్పి ఒకటి. చాక్లెట్లను ఎక్కువగా తింటే తలనొప్పి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

మాంసం

మాంసాన్ని ఎక్కువగా తినకూడదు. ఎందుకంటే ఇది కొలెస్ట్రాల్ ను పెంచడంతో పాటుగా ఎన్నో రోగాలకు దారితీస్తుంది. సాసేజ్ లు, హాట్ డాగ్స్ మొదలైనవి తలనొప్పిని పెంచుతాయి.
 

migraine

జున్ను

జున్ను చాలా టేస్టీగా ఉంటుంది. కానీ దీన్ని తింటే కూడా తలనొప్పి బాగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే జున్నును అతిగా తినకూడదు. 

పెరుగు

పెరుగును ఎక్కువగా తినడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. కాబట్టి తరచూ తలనొప్పితో బాధపడేవారు ఇలాంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి. 

ఐస్ క్రీం

మీకు తలనొప్పిగా ఉన్నప్పుడు ఐస్ క్రీం వంటి చల్లని ఆహారాలను తినకండి. ఎందుకంటే ఇవి మీ తలనొప్పిని బాగా పెంచుతాయి. 

Latest Videos

click me!