వీటిని తిన్నా మీ బెల్లీ ఫ్యాట్ తొందరగా తగ్గుతుంది తెలుసా?

First Published Jun 3, 2023, 4:30 PM IST

వ్యాయామం చేయకపోవడం, అతిగా తినడం వల్ల పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటుగా మంచి జీవన శైలిని అలవర్చుకోవాలి. చక్కెరను ఎక్కువగా తినకూడదు. అలాగే.. 
 

belly fat

బెల్లీ ఫ్యాట్ ను చిన్న సమస్యగా తీసుకోవడానికి లేదు. ఎందుకంటే ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది.  ఈ బెల్లీ ఫ్యాట్ ను కరిగించుకోవడానికి చాలా మంది ఎన్నో ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయినా ఇంచు కూడా తగ్గనివారున్నారు. రోజు వ్యాయామం చేయకపోవడం, ఇష్టారీత్యా తినడం, తీపి పదార్థాలను అతిగా తినడం, కొవ్వు, కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ వస్తుంది. బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే ఈ అలవాట్లకు దూరంగా ఉండాలి. అయితే కొన్ని ఆహారాలు కూడా బెల్లీ ఫ్యాట్ ను తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటంటే.. 

పెరుగు

ఎండాకాలంలో పెరుగును తినడం వల్ల మన ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. ఇది శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండే పెరుగు జీర్ణక్రియను మెరుగుపరచడానికి, కడుపు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. అంతేకాదు పెరుగును తింటే బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.  
 

గుడ్లు

గుడ్లు సంపూర్ణ ఆహారం. గుడ్లలో మనల్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ప్రోటీన్, అమైనో ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కొవ్వును కరిగించే వ్యవస్థను ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ప్రతిరోజూ ఒక ఉడుకబెట్టిన గుడ్డును తినండి. బెల్లీ ఫ్యాట్ కరుగుతుంది. 
 

green peas

పచ్చి బఠానీలు

పచ్చి బఠానీల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇవి మన ఆకలిని నియంత్రిస్తాయి. వీటిని తింటే కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. పచ్చి బఠానీల్లో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు పచ్చి బఠానీలను రోజూ కొద్ది  మొత్తంలో తినొచ్చు.
 

క్యారెట్లు

క్యారెట్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్లలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, బయోటిన్, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యారెట్లను తినడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉండటమే కాదు బెల్లీ ఫ్యాట్ కూడా తగ్గుతుంది. దీనిలో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. 
 

బచ్చలికూర

ఆకుకూరల్లో మన శరీరానికి కావాల్సిన పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, ప్రోటీన్లు, ఫైబర్స్ కూడా ఉంటాయి. బచ్చలికూరను క్రమం తప్పకుండా తినడం వల్ల బెల్లీ ఫ్యాట్ తగ్గుతుంది. అలాగే మీరు ఆరోగ్యంగా బరువు తగ్గుతారు. 
 

Image: Getty

బీట్ రూట్

బీట్ రూట్ లో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో విటమిన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇందులో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది. బీట్ రూట్ ను తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది. బరువు కూడా తగ్గుతారు. 

click me!