ఎండాకాలంలో క్యాప్సికమ్ ను తింటే..!

First Published | Jun 4, 2023, 10:27 AM IST

క్యాప్సికమ్ లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇది తేలిగ్గా జీర్ణమవుతుంది. ఎండాకాలంలో ఈ కూరగాయను తింటే బరువు ఈజీగా తగ్గుతారు. అలాగే..
 

క్యాప్సికమ్ టేస్టీగా ఉండటమే కాదు హెల్తీగా కూడా ఉంటుంది. క్రీస్తుపూర్వం 6000 నుంచి క్యాప్సికమ్ ను వంటలో ఉపయోగించడం ప్రారంభించినట్టు రికార్డులు వెల్లడిస్తున్నాయి. క్యాప్సికమ్ ఎన్నో రంగుల్లో ఉంటుంది. ఈ కూరగాయ ఆకుపచ్చ, పసుపు పచ్చ, ఎరుపు, నారింజ రంగులో ఉంటుంది. ఈ కూరగాయను ఎండాకాలంలో తప్పకుండా తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది బరువు తగ్గడానికి సహాయపడటంతో పాటుగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. 

హైడ్రేటింగ్ 

న్యూట్రీషియన్ జర్నల్ ప్రకారం.. ఎండాకాలంలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న కూరగాయలు, సలాడ్లను తినాలి. ఇవి శరీరాన్ని హైడ్రేట్ చేస్తాయి. క్యాప్సికమ్స్ సూపర్ హైడ్రేటింగ్ గా పనిచేస్తుంది. పుచ్చకాయ వంటి పండ్లలో 92 శాతం నీరు ఉంటుంది. ఈ క్యాప్సికమ్ లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. 


జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రకారం.. మధ్యధరా ఆహారంలో క్యాప్సికమ్ ఎక్కువగా ఉపయోగించబడుతుంది. దీన్ని తాజా సలాడ్లు, స్టఫింగ్ లో కూడా ఉపయోగిస్తారు. దీన్ని పచ్చిగా కూడా తినొచ్చు. అసలు ఎండాకాలంలో క్యాప్సికమ్ ను తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

ఎలక్ట్రోలైట్ల సరఫరా 

జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ లో ప్రచురితమైన ఒక పరిశోధన కథనం ప్రకారం.. క్యాప్సికమ్ లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, కెరోటినాయిడ్లు, డైటరీ ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. క్యాప్సికమ్ లో విటమిన్ బి6, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్, సెల్యులార్ ఆక్సీకరణతో పోరాడటానికి సహాయపడతాయి. ఈ కూరగాయలో ఎలక్ట్రోలైట్స్ ముఖ్యంగా పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఎండాకాలంలో ఈ కూరగాయ మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచుతుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 

Image: Getty Images

కేలరీలను కరిగించడానినకి సహాయపడుతుంది 

జర్నల్ ఆఫ్ ఫుడ్ ప్రొటెక్షన్ ప్రకారం.. రెడ్ బెల్ పెప్పర్ ఎండాకాలంలో ఫాస్ట్ గా బరువు తగ్గడానికి బాగా సహాయపడుతుంది. ఇది థర్మోజెనిసిస్ ను సక్రియం చేయడానికి, జీవక్రియ రేటును పెంచడానికి సహాయపడుతుంది. ఇది హృదయ స్పందన రేటును, రక్తపోటును పెంచకుండా జీవక్రియ రేటును పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది.
 

గుండె సమస్యలను నయం చేస్తుంది

హార్వర్డ్ హెల్త్ బ్లాగ్ ప్రకారం.. రెడ్ క్యాప్సికమ్ లో లైకోపీన్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. గ్రీన్ క్యాప్సికమ్ లో ఉండే ఫైబర్ కంటెంట్ మీ కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. పెరిగిన హోమోసిస్టీన్ స్థాయిలు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతాయి. క్యాప్సికమ్ లో విటమిన్ బి 6, ఫోలేట్ లు ఉంటాయి. ఇది హోమోసిస్టీన్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడుతుంది. క్యాప్సికమ్ లో ఉండే పొటాషియం రక్తపోటును తగ్గిస్తుంది. ఇది గుండెకు కూడా మేలు ఎంతో చేస్తుంది. ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థ కోసం 

న్యూట్రీషియన్ జర్నల్ ప్రకారం.. రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండేందుకు కూడా క్యాప్సికమ్ సహాయపడుతుంది. చర్మం, కీళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ అవసరం. దీన్ని తయారు చేయడానికి విటమిన్ సి అవసరం. ఇది ఆర్థరైటిస్, మంట ప్రమాదాన్ని తగ్గిస్తుంది. విటమిన్ కె రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఎముకలను బలంగా ఉంచేందుకు, ఆక్సీకరణ నష్టం నుంచి కణాల రక్షణకు ఇది చాలా అవసరం.

కళ్లకు మేలు 

జర్నల్ ఆఫ్ ఆయుర్వేదం ప్రకారం.. రెడ్ క్యాప్సికమ్ లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది లుటిన్ కెరోటినాయిడ్లకు గొప్ప మూలం. ఇది కళ్ల మాక్యులర్ క్షీణత ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. కళ్ల మాక్యులర్ క్షీణత వయస్సు-సంబంధిత సమస్య. క్యాప్సికమ్ లో బీటా కెరోటిన్, విటమిన్ సి లు ఎక్కువగా ఉంటాయి. ఇది కంటిశుక్లం నుంచి కళ్లను కాపాడుతుంది.
 

Latest Videos

click me!