Meat: మటన్ అంటే ఇష్టమా? ఫ్రెష్ గా ఉంటుందని కోసిన వెంటనే వండేస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

Published : May 30, 2026, 01:58 PM IST

Meat: కొన్నిచోట్ల పండుగలప్పుడో, మొక్కులున్నప్పుడో..జంతు బలులు ఇస్తారు. వాటిని ప్రసాదంగా ఇంటికి తెచ్చుకుని తింటారు. కొంతమంది నిల్వ చేసుకుని తింటారు. కానీ ఆ మాంసం నిల్వ చేసేటప్పుడు ఈ తప్పులు చేస్తుంటారు. అలా చేస్తే మాంసం త్వరగా పాడైపోతుంది. 

PREV
15
సరైన పద్ధతి ముఖ్యం

చికెన్, మటన్ తాజాగా, పాడవకుండా ఉంచాలంటే సరైన నిల్వ విధానం తప్పనిసరి. తగిన ఉష్ణోగ్రతలో నిల్వ చేయకపోతే హానికర సూక్ష్మజీవులు వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే సరిగా వండని మాంసం తింటే ఫుడ్ పాయిజన్ అయ్యి.. జీర్ణ సమస్యలు, ఆరోగ్యం పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే నిల్వ, వంట విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. 

25
వెంటనే వండొద్దు

బలి ఇచ్చిన మాంసాన్ని వెంటనే వండకూడదు. ఎందుకంటే చాలా సేపటి వరకు గట్టిగా ఉంటుంది. ఈ సమయంలో వండితే రుచి బాగోదు, కడుపులో సమస్యలు వస్తాయి. మాంసాన్ని కొన్ని గంటలపాటు అలా వదిలేయాలి. చల్లగా, గాలి తగిలే ప్రదేశంలో ఉంచడం మంచిది. అప్పుడు వండుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు.

35
ఎలా నిల్వ చేయాలి?

వెంటనే వండకూడదనే కారణంతో చాలామంది మాంసాన్ని నిల్వచేస్తారు. ప్లాస్టిక్ కవర్లలో కుక్కేస్తారు. దీనివల్లే మాంసం త్వరగా పాడవుతుంది. ప్లాస్టిక్ కవర్లలో తేమ చేరి బ్యాక్టీరియా పెరుగుతుంది. దానివల్ల మాంసం వాసనొచ్చి కుళ్లిపోతుంది. ముందుగా మాంసాన్ని గాలికి ఆరనివ్వాలి. వేడి తగ్గాక, ఒక ట్రే లేదా పెద్ద గిన్నెలో పరచాలి. గది ఉష్ణోగ్రతకు వచ్చాకే ఫ్రిజ్‌లో లేదా ఫ్రీజర్‌లో పెట్టాలి.

45
ఫ్రీజర్‌లో పెట్టేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

ఫ్రీజర్‌లో మాంసం పెట్టేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నాణ్యత లేని ప్లాస్టిక్ కవర్లు వాడితే మాంసంపై బూడిద రంగు మచ్చలు వస్తాయి. దీన్నే 'ఫ్రీజర్ బర్న్' అంటారు. ఇది మాంసాన్ని పొడిగా మార్చేసి, రుచి కూడా మారుతుంది. అందుకే, ఎప్పుడూ మంచి క్వాలిటీ, గాలి చొరబడని డబ్బా లేదా ఫ్రీజర్ బ్యాగ్ వాడాలి. ఫ్రీజర్‌లోని మాంసాన్ని బయటకు తీసి, మళ్లీ లోపల పెట్టొద్దు. పూర్తిగా కరిగాక మళ్లీ గడ్డకట్టించకూడదు.

55
మాంసాన్ని ఇలా వండండి

మాంసాన్ని సరైన పద్ధతిలో వండటం ముఖ్యం. లేదంటే రుచి పాడవుతుంది. కూరగాయలు కోసే చెక్కపైనే మాంసాన్ని కోయకూడదు. దీనివల్ల క్రాస్ కంటామినేషన్ జరిగి మాంసం పాడయ్యే ప్రమాదం ఉంది. బార్బెక్యూ చేసేటప్పుడు, మాంసాన్ని మరీ ఎక్కువ మంట దగ్గర పెట్టకూడదు. మాంసం ఎక్కువగా మాడిపోకూడదు. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది, రుచి కూడా దెబ్బతింటుంది.

Read more Photos on
click me!

Recommended Stories