Fish Fry: హోటల్ స్టైల్‌లో క్రిస్పీ ఫిష్ ఫ్రై.. సింపుల్‍గా ఇలా చేసేయండి!

Published : Apr 18, 2026, 02:46 PM IST

చాలామంది ఫిష్ ఫ్రైని లొట్టలేసుకుంటూ తింటారు. నిజానికి ఫిష్ ఫ్రై చేయడం ఈజీగా అనిపించినా, సరైన పద్ధతి తెలియకపోతే చేప ముక్కలు పెనానికి అంటుకుపోవడం, విరిగిపోవడం వంటివి జరుగుతాయి. సింపుల్ గా హోటల్ స్టైల్‌లో కరకరలాడే ఫిష్ ఫ్రై ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం. 

PREV
16
క్రిస్పీ ఫిష్ ఫ్రై రెసిపీ

ఫిష్ ఫ్రై బాగా రావాలంటే ముందుగా సరైన చేపను ఎంచుకోవాలి. మరీ మెత్తగా ఉండే చేపలు త్వరగా విరిగిపోతాయి. అందుకే, ఫ్రై చేయడానికి సుర్మాయి, రోహు, కట్ల లేదా పాంఫ్రెట్ వంటి కొంచెం గట్టిగా ఉండే చేపలను ఎంచుకోవాలి. ఇవి రుచిగా ఉంటాయి. ఫ్రై చేయడానికి అనువుగా ఉంటాయి.

26
చేపలు కట్ చేసే విధానం

చేపలను ఫ్రై చేసేటప్పుడు వాటిని కట్ చేసే విధానం కూడా ముఖ్యమే. చేప ముక్కలు మరీ సన్నగా ఉంటే త్వరగా విరిగిపోతాయి. కాబట్టి ముక్కలను సుమారు 1 నుంచి 1.5 అంగుళాల మందంతో కట్ చేయాలి. అన్ని ముక్కలు ఒకే సైజులో ఉంటే, సమానంగా వేగుతాయి.

36
తేమ లేకుండా..

చేపను కడిగాక, దానిలో నీళ్లు ఉండకూడదు. తేమ ఉంటే నూనెలో వేయగానే చిటపటలాడుతుంది, చేప మెత్తబడిపోతుంది. అందుకే కిచెన్ టిష్యూతో చేపను బాగా తుడవాలి. వీలైతే, మసాలా పట్టించే ముందు 20 నిమిషాలు గాలికి ఆరబెట్టాలి

46
మసాల, మ్యారినేషన్

పసుపు, కారం, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, నిమ్మరసంతో మసాలా రెడీ చేయాలి. చేప ముక్కలకు మసాలా పట్టించాక ఎక్కువసేపు ఉంచకూడదు. లేదంటే చేప నుంచి నీరు బయటకు రావడం మొదలవుతుంది. చేప క్రిస్పీగా రావాలంటే బియ్యం పిండి, శనగపిండి లేదా బొంబాయి రవ్వ వాడాలి. రవ్వ వేస్తే ఫ్రై చేసినప్పుడు, బయటి పొర మరింత క్రిస్పీగా ఉంటుంది.

56
పెనం ఎంపిక

ఫిష్ ఫ్రై చేయడానికి కాస్ట్ ఐరన్ పెనం చాలా మంచిది. ఇది వేడిని చక్కగా నిలుపుకుంటుంది. చేప పెనానికి అంటుకోకుండా చూస్తుంది. స్టీల్ లేదా నాన్-స్టిక్ పెనాలు కూడా వాడొచ్చు, కానీ పెనం బాగా వేడెక్కిన తర్వాతే చేప ముక్కలు వేయాలి.

66
నూనె ఉష్ణోగ్రత

నూనె సరిగ్గా వేడయ్యాక చేప ముక్కలు వేయాలి. లేకపోతే ముక్కలు ఎక్కువ నూనె పీల్చుకుంటాయి. అలాగనీ నూనె మరీ ఎక్కువగా కాగితే, బయట మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. అందుకే, మీడియం ఫ్లేమ్ మీద నూనె కాగాకే చేప ముక్కలు వేయించుకోవాలి.

చేప ముక్కను నూనెలో వేయగానే గరిటెతో తిప్పేయొద్దు. 2-3 నిమిషాలు ఒకవైపు బాగా వేగనివ్వాలి. అంచులు బంగారు రంగులోకి మారినప్పుడు మాత్రమే నెమ్మదిగా తిరగేయాలి. పదేపదే తిప్పితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా సింపుల్ చిట్కాలతో కరకరలాడే ఫిష్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories