టిఫిన్‌కి బ్రేక్‌ఫాస్ట్‌కి తేడా ఏంటో తెలుసా.? అస‌లు టిఫిన్ అనే ప‌దం ఎలా వ‌చ్చిందంటే

Published : Apr 18, 2026, 10:34 AM IST

Tiffin: “టిఫిన్” అనే పదం ఎంతలా ప్రాచుర్యం పొందిందంటే, అది విదేశీ పదమనే విషయం కూడా చాలా మందికి తెలియదు. ఉదయం అల్పాహారం నుంచి సాయంత్రం స్నాక్స్ వరకు అన్నింటికీ మనం టిఫిన్ అనే పదమే వాడుతుంటాం. కానీ ఈ ప‌దం వెన‌కా ఉన్న చ‌రిత్ర ఏంటో తెలుసా.? 

PREV
15
బ్రిటిష్ కాలంలో పుట్టిన “టిఫిన్”

“టిఫిన్” అనే పదం మూలం బ్రిటిష్ ఇండియా కాలానికి చెందింది. ఇది పాత ఇంగ్లీష్ పదమైన “Tiffing” నుంచి వచ్చింది. “Tiffing” అంటే కొద్దిగా తాగడం లేదా స్వల్పంగా ఏదైనా తీసుకోవడం. బ్రిటిష్ అధికారులు భారతదేశంలో ఉన్నప్పుడు, ఇక్కడి వాతావరణం కారణంగా మధ్యాహ్నం ఎక్కువ‌ భోజనం చేయడం కష్టంగా ఉండేది. అందుకే తేలికగా తినే ఆహారాన్ని “టిఫిన్” అని పిలవడం మొదలుపెట్టారు.

25
మధ్యాహ్న భోజనం నుంచి అల్పాహారంగా మారిన ప్రయాణం

మొదట్లో బ్రిటిష్ వారు మధ్యాహ్న సమయంలో తీసుకునే లైట్ మీల్‌ను “టిఫిన్” అని పిలిచేవారు. కానీ భారతీయులు ఈ పదాన్ని తమ ఆహారపు అలవాట్లకు అనుగుణంగా మార్చుకున్నారు. మన దగ్గర ఉదయం తినే ఇడ్లీ, దోశలు.. సాయంత్రం తినే లైట్ ఫుడ్ ఇవన్నీ తేలికపాటి ఆహారం కాబట్టి, వాటికి “టిఫిన్” అనే పేరు క్రమంగా స్థిరపడిపోయింది. ఇలా మధ్యాహ్నానికి సంబంధించిన పదం… ఉదయం అల్పాహారానికి మారింది.

35
“టిఫిన్” “బ్రేక్‌ఫాస్ట్” రెండింటి మ‌ధ్య‌ తేడా ఏంటి?

ఇంగ్లీష్‌లో ఉదయం భోజనాన్ని “Breakfast” అంటారు. రాత్రి చివ‌రిగా తిన్న మీల్ త‌ర్వాత ఎక్కువ‌సేపు ఫాస్టింగ్‌లో ఉంటాం. ఉద‌యం ఆ ఫాస్టింగ్‌ను బ్రేక్ చేస్తాం కాబ‌ట్టే దానిని బ్రేక్‌ఫాస్ట్‌గా అంటారు. కానీ మనం మాత్రం ఇడ్లీ, దోశ, ఉప్మా వంటి వాటినే “టిఫిన్” అంటాం. అన్నం, కూరలను మాత్రం “భోజనం”గా వేరుగా చూస్తాం. అంటే “టిఫిన్” మన దగ్గర ఒక ప్రత్యేకమైన అర్థాన్ని పొందింది.. తేలికగా తినే ఆహారం అన్నమాట

45
టిఫిన్ బాక్స్ – ప్రపంచానికి పరిచయం చేసిన భారతం

“టిఫిన్” అనే పదం ప్రపంచానికి విస్తరించడానికి ఒక ముఖ్య కారణం “టిఫిన్ బాక్స్” సంస్కృతి. ప్రత్యేకంగా ముంబై డ‌బ్బావాలా వ్యవస్థ దీనికి పెద్ద ఉదాహరణ. ఇంటి వంటను ఆఫీసులకు తీసుకెళ్లే డబ్బాలను “టిఫిన్ బాక్స్” అని పిలవడం వల్ల. ఈ పదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఇంగ్లీష్‌లో ఇది ఒక ప్రత్యేక పదంగా నిలిచింది.

55
తెలుగు రాష్ట్రాల్లో “టిఫిన్ సెంటర్” సంస్కృతి

తెలుగు రాష్ట్రాల్లో “టిఫిన్ సెంటర్” అనే పదం ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా ఉడుపి హోటల్స్ ద్వారా ఈ సంస్కృతి గ్రామాల నుంచి పట్టణాల వరకు విస్తరించింది. ఇప్పుడు ఉదయం అల్పాహారం, సాయంత్రం స్నాక్స్ అన్నింటికీ “టిఫిన్” అనే పదమే సాధారణంగా వాడుకలో ఉంది. మొత్తం మీద “టిఫిన్” అనే పదం బ్రిటిష్ కాలంలో పుట్టినా, భారతీయులు దానికి కొత్త అర్థం ఇచ్చారు. మధ్యాహ్నం తేలికపాటి భోజనం నుంచి… మన రోజువారీ అల్పాహారానికి ఈ పదం మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే. విదేశీ పదాన్ని మన సంస్కృతికి సరిపోయేలా మార్చుకుని, మనదైన గుర్తింపుగా నిలిపిన అద్భుత ఉదాహరణే “టిఫిన్”. 

Read more Photos on
click me!

Recommended Stories