Vegetable Biryani: ఇంట్లో కూరగాయల్లేనప్పుడు కూడా హోటల్ స్టైల్ రుచితో, ఘుమఘుమలాడే వెజిటేబుల్ బిర్యానీ ఎప్పుడైనా తిన్నారా?. ఇది బ్యాచిలర్స్ కి బెస్ట్ ఛాయిస్, టైం లేనప్పుడు క్విక్‍గా వంట ముగించాలనుకునే వారికి పర్ఫెక్ట్ ఆప్షన్. ఎలా చేయాలో ఇక్కడ చూద్దాం.
10 నిమిషాల్లో రెడీ అయ్యే వెజిటేబుల్ బిర్యానీ..ఫుల్ రెసిపీ
బ్యాచిలర్స్, ఆఫీసులకు వెళ్లేవారు...రోజూ కూరగాయలు తెచ్చుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది. వారానికి సరిపడా తెచ్చుకున్నా వీకెండ్ లో అయిపోతాయి. అప్పటికప్పుడు తెచ్చుకునే ఓపిక ఉండదు. అలాంటప్పుడు కూడా హోటల్ స్టైల్‍లో అదిరిపోయే బిర్యానీ చేయోచ్చు. ఎక్కువ టైం పట్టదు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ఎలా చేసుకోవాలో ఫుల్ రెసిపీ చూసేయండి.
25
కావలసిన పదార్థాలు
బియ్యం: 2 కప్పులు (బాస్మతీ బెటర్ )
ఉల్లిపాయలు: 2 పెద్దవి, పొడవుగా కోసుకోవాలి.
పచ్చిమిర్చి: 4
అల్లం వెల్లుల్లి పేస్ట్: ఒక స్పూన్
పెరుగు: అర కప్పు
పుదీనా, కొత్తిమీర, కరివేపాకు: కొంచెం కొంచెం
నూనె + నెయ్యి: మీకు కావాల్సినంత
బిర్యానీ దినుసులు
ఉప్పు సరిపడా
35
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని కడిగి ఒక 20-30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో నూనె, నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ దినుసులు వేసి వేయించండి. ఉల్లిపాయ ముక్కలు వేసి అవి బంగారు రంగు వచ్చే వరకు వేయించండి. ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాక.. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు వేయండి. లేదా ఆ 3 కలిపి పేస్ట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత కారం, పసుపు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా వేసి కలపండి.
తర్వాత కాస్త మంట తగ్గించి పెరుగు వేసి బాగా కలపండి. పెరుగు నూనె నుండి వేరయ్యే వరకు ఉడికించండి. ఇదే ఈ బిర్యానీకి అసలైన టేస్ట్ ఇస్తుంది. 2 కప్పుల బియ్యానికి, సుమారు 3 నుండి 3.5 కప్పుల నీళ్లు పోయండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఎసరు మరిగేటప్పుడు ఉప్పు చూస్తే, నీళ్లు కొంచెం ఉప్పగా ఉండాలి. ఎసరు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపండి.
కుక్కర్ అయితే మూత పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మామూలు గిన్నె అయితే నీరు ఇంకిపోయే వరకు మూత పెట్టి చిన్న మంట మీద మగ్గనివ్వండి.
55
రైతా లేదా మిర్చి కా సాలన్‍తో తింటే అద్భుతం
ఒకవేళ మీ ఇంట్లో బంగాళాదుంప ఉంటే ముక్కలు చేసుకుని తాళింపులో వేసుకుంటే రుచి పెరుగుతుంది. మీల్ మేకర్ ఉంటే వాటిని వేడి నీళ్లలో నానబెట్టి వేయండి, కూరగాయల లోటు తెలియదు.
ఈ వేడి వేడి బిర్యానీని పెరుగు రైతా లేదా మిర్చి కా సాలన్‍తో తింటే అద్భుతంగా ఉంటుంది. తక్కువ శ్రమతో అదిరిపోయే రుచి వచ్చేస్తుంది. ట్రై చేసి చూడండి.