గోరువెచ్చని నీరు, డిష్ వాష్
గోరువెచ్చని నీరు, డిష్ వాష్ కలిపి లిక్విడ్ లా చేసి పాత్రలు తోమితే మొండి మరకలు సులభంగా శుభ్రమైపోతాయి. ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీరు తీసుకోండి. తర్వాత అందులో కొన్ని చుక్కల డిష్ వాష్ వేయండి. రాత్రంతా అలానే ఉంచండి. మరుసటి రోజు ఉదయం స్క్రబ్‌తో మొండి మరకలను బాగా రుద్దాలి. తర్వాత సాధారణ నీటితో శుభ్రం చేస్తే పాత్ర కొత్తదానిలా మెరిసిపోతుంది.