Fermented Rice: ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్ ఫాస్ట్ లో చద్ది అన్నం, ఉల్లిపాయ తింటే ఏమౌతుంది?

Published : Mar 08, 2025, 12:25 PM ISTUpdated : Mar 08, 2025, 01:31 PM IST

  ఉదయాన్నే రకరకాల బ్రేక్ ఫాస్ట్ లు తినే బదులు.. చద్దన్నం తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయట.  మరి, ఆ ప్రయోజనాలేంటో తెలుసుకుందామా...  

PREV
15
Fermented Rice: ఇడ్లీ, దోశ కాదు.. బ్రేక్ ఫాస్ట్ లో చద్ది అన్నం, ఉల్లిపాయ తింటే ఏమౌతుంది?

ప్రస్తుత కాలంలో అందరూ ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ, దోశ, పూరీ అంటూ రక రకాల బ్రేక్  ఫాస్ట్ లను ఆస్వాదిస్తున్నారు. కానీ, మన పూర్వీకులు మాత్రం రోజూ ఉదయాన్నే చద్దన్నం మాత్రమే తినేవారు. ఈ రోజుల్లో చద్దన్నం తినడం అంటే వాళ్లు పేదవాళ్లు అనే భావనలోకి వచ్చేస్తున్నారు. కానీ... తాజా పరిశోధనలో తేలిన విషయం ఏమిటంటే... చద్దన్నానికి మించిన గొప్ప బ్రేక్ ఫాస్ట్ మరోటి లేదు. ఈ విషయం తెలిసిన తర్వాత.. చాలా ఫైవ్ స్టార్ హోటల్లో, విదేశాల్లో కూడా ఈ అన్నాన్ని ఫర్మినెంటెడె రైస్ పేరిట అమ్ముతున్నారు. మరి, రోజూ ఈ అన్నం తింటే కలిగే ప్రయోజనాలేంటో చూద్దాం..

 

25
పోషకాలు

చద్దన్నంలో చాలా పోషకాలు ఉంటాయి. ఇందులో  ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  రెగ్యులర్ గా మనం తినే అన్నం కంటే... ఈ చద్దన్నంలో 21 రెట్లు ఎక్కువ ఐరన్ ఉంటుందని అధ్యయనాల్లో తేలడం విశేషం.

చద్దన్నంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీర అలసటను తగ్గిస్తుంది, కడుపులో యాసిడ్, గ్యాస్ పెరగకుండా చూసుకుంటుంది, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది.

35
శరీరాన్ని చల్లగా ఉంచుతుంది

 

పేగు ఆరోగ్యానికి మంచిది

పాత అన్నంలో ఉండే విటమిన్ బి కడుపులో ఉండే పుండ్లు అంటే అల్సర్‌ను నయం చేస్తుంది. ఇంకా చద్ది అన్నంలో చాలా సూక్ష్మజీవులు, పోషకాలు ఉత్పత్తి అవుతాయి. ఇది మన శరీరంలోని పీహెచ్ స్థాయిని మెరుగుపరుస్తుంది, పేగులో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.

 

45
మలబద్ధకాన్ని తగ్గిస్తుంది

చద్దన్నం శరీరంలో జీర్ణశక్తిని, ఆరోగ్యకరమైన పేగు కదలికలను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ముఖ్యంగా ఇది మంచి భేదిమందులా పనిచేస్తుంది. అంటే పేగు కదలికలను సరిచేసి మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చేస్తుంది.

చర్మం, జుట్టు

చద్దన్నం చర్మంపై వృద్ధాప్య ఛాయలు రాకుండా చేస్తుంది. ఇంకా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. పాత అన్నంలోని నీళ్లన్నాన్ని జుట్టుకు కండీషనర్‌గా కూడా ఉపయోగించవచ్చు. దీని కోసం మీరు షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ నీటితో జుట్టును కడగాలి. దీంతో జుట్టు గట్టిగా, మెరిసేలా మారుతుంది. ముఖ్యంగా ఈ నీటిలో ఉండే విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి.

55
ఇతర ప్రయోజనాలు:

- చద్దన్నంలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి చాలా సహాయపడుతుంది.

- ఇంకా వీటిలో మెగ్నీషియం, సెలీనియం ఎక్కువగా పొందవచ్చు. ఇవి మన ఎముకలు గట్టిగా ఉండటానికి సహాయపడతాయి.

మరి.. ఈ చద్దన్నం ఎలా తయారు చేయాలో తెలుసా?

రాత్రి వండిన అన్నం మిగిలిపోతే .. దానిని ఒక మట్టి గిన్నెలో వేయాలి. అందులోనే నీళ్లు పోసి.. కొంచెం పెరుగు కలపాలి. అందులో రుచికి తగినంత ఉప్పు వేసి.. ఉల్లిపాయ ముక్కలు కూడా చేర్చాలి. అంతే.. దానిని  ఉదయాన్నే తినేస్తే సరిపోతుంది.

Read more Photos on
click me!

Recommended Stories