అప్పాలు.. ఈ బ్రేక్ ఫాస్ట్ ఫుడ్ కేరళ వంటకమే అయినా పిల్లలు, పెద్దలు బాగా ఇష్టపడే ఒక రకమైన పాన్ కేక్ ఇది. తెలుగు రాష్ట్రాల్లో దిబ్బరొట్టెలాంటిది అన్న మాట. దక్షిణ భారత దేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇది చాలా ఫేమస్ బ్రేక్ ఫాస్ట్. క్రిస్పీగా, రుచిగా ఉండే ఈ బ్రేక్‌ఫాస్ట్ ఐటమ్ ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అప్పాలు ఎలా తయారు చేయాలి?
1. ముందుగా 1.5 కప్పుల రెగ్యులర్ తెల్ల బియ్యం (సోనా మసూరి, పర్మాళ్, సుర్తి కోలం లేదా పొన్ని బియ్యం) నీటిలో వేసి బాగా కడగాలి. తర్వాత ఆ బియ్యాన్ని 2 కప్పుల నీటిలో 4 నుండి 5 గంటల పాటు నానబెట్టాలి. గిన్నెను మూతతో కప్పి ఉంచడం మర్చిపోవద్దు. మీరు కావాలంటే సాధారణ పచ్చి బియ్యం, ఉడికించిన బియ్యం రెండింటినీ సమానంగా కలపవచ్చు.
2. నీటిని వంపేసి, నానబెట్టిన బియ్యాన్ని బ్లెండర్ లేదా గ్రైండర్ జార్‌లోకి మార్చండి. అర కప్పు తాజాగా తురిమిన కొబ్బరి, పావు కప్పు అటుకులు, అర టీస్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల చక్కెర వేయండి.
అటుకులకు బదులుగా మీరు ఉడికించిన అన్నం, ఆవిరి మీద ఉడికించిన అన్నం లేదా మరమరాలు కూడా వాడవచ్చు.
మీరు అటుకులను వాడాలనుకుంటే బియ్యంతో పాటు లేదా విడిగా 30 నిమిషాలు నానబెట్టాలి. లేదంటే మీరు వాటిని నీటితో కడిగి నేరుగా బ్లెండర్‌కు వేయవచ్చు.
3. తర్వాత అవసరమైనంత నీరు పోసి మిశ్రమాన్ని మెత్తగా, జారుడుగా ఉండేలా కలపండి. పిండి మరీ పలుచగా ఉంటే కొన్ని టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని కలిపి చిక్కగా చేయవచ్చు.
4. పిండిని ఒక మీడియం లేదా పెద్ద మిక్సింగ్ గిన్నెలోకి పోయాలి. ఈ పిండిని పులియబెట్టడానికి ఈస్ట్ కలపండి. దీని వల్ల పిండి త్వరగా పులుస్తుంది.
5. ఈస్ట్ పూర్తిగా కరిగేలా పిండిని బాగా కలపండి. తర్వాత గిన్నెపై మూత వేసి 1 నుండి 2 గంటల పాటు పులియబెట్టండి.
6. పిండి పులిసిన తర్వాత తేలికగా మారి రెట్టింపు అవుతుంది. అందులో బుడగలు లేదా గాలి పాకెట్లు కనిపిస్తాయి.
అప్పాలు తయారు చేయడం ఇలా..
పాన్ లేదా కడాయిని తీసుకొని వేడి చేయండి. పాన్‌లో అర టీస్పూన్ నూనె వేసి అంతటా సమానంగా స్ప్రెడ్ చేయండి. మీరు నాన్‌స్టిక్ కడాయిని ఉపయోగిస్తుంటే నూనె వేయొద్దు. పాన్ వేడెక్కిన తర్వాత గరిటెడు పిండిని పాన్ మధ్యలో వేయండి. గుండ్రంగా పలుచని అంచులు, కొద్దిగా మందంగా ఉండేలా పాన్‌ను వృత్తాకారంలో తిప్పండి. అవసరమైన విధంగా వేడిని అడ్జెస్ట్ చేస్తూ అప్పం తయారు చేయండి.
పిండిని ఒక రోజులోనే ఉపయోగించాలి
అప్పాలు తయారు చేసే పిండిని ఒక రోజులోనే ఉపయోగించాలి. లేదంటే పాడైపోతుంది.
కేరళలో అయితే అప్పాలను వెజిటబుల్ స్టూ, తీపి కొబ్బరి పాలతో కలిపి తింటారు. మన తెలుగు రాష్ట్రాల్లో వెజ్ కూర్మా లేదా బంగాళదుంప కూరతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.
ఇది కూడా చదవండి వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు.. ఎందుకో తెలుసా?