Curd: రోజూ పెరుగు తినడం వల్ల ఎన్ని లాభాలో తెలుసా?

Curd: చాలామందికి పెరుగు తినకుంటే భోజనం కంప్లీట్ అయిన ఫీలింగ్ ఉండదు. కొందరైతే 3 పూటలు పెరుగు తింటారు. ఇక వేసవి కాలంలో అయితే పెరుగు తప్పనిసరి. మరి ప్రతి రోజూ పెరుగు తినడం వల్ల కలిగే లాభాలెంటో ఇక్కడ తెలుసుకుందాం.

మనలో చాలామంది పెరుగు లేకుండా అసలు భోజనమే చేయరు. పెరుగలో పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, పెరుగు గ్యాస్, ఉబ్బరం, అసిడిటీని కూడా తగ్గిస్తుంది. రోజూ పెరుగు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలెంటో ఇక్కడ చూద్దాం.

ఒక అధ్యయనం ప్రకారం పెరుగు ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పెరుగులోని కాల్షియం ఎముకల సాంద్రతను సమతుల్యం చేయడమే కాకుండా వాటిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

చర్మం తేమగా

ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని ప్రోత్సహించే సామర్థ్యం పెరుగుకు ఉంది. పెరుగులో సహజ మాయిశ్చరైజింగ్ పదార్థాలు ఉన్నాయి. ఇది చర్మాన్ని పొడిగా చేయకుండా నివారిస్తుంది. మొటిమలు రాకుండా చేస్తుంది. అంతేకాకుండా లాక్టిక్ యాసిడ్ ఉండటం వల్ల ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు.


మహిళలకు మేలు

మహిళలు పెరుగు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఈస్ట్ ఇన్ఫెక్షన్ల పెరుగుదలను నిరోధిస్తుంది. పెరుగులోని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా కారణంగా ఇది ఈస్ట్ బ్యాలెన్స్‌ను పునరుద్ధరిస్తుంది.

మెరుగైన జీవక్రియ

పెరుగు జీవక్రియను మరింత పెంచుతుంది. మెరుగైన జీవక్రియ బరువు తగ్గించే ప్రక్రియను సులభతరం చేస్తుంది. పెరుగులో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి తినడం చాలా మంచిది. పెరుగు మంచి ప్రోబయోటిక్. మంచి బ్యాక్టీరియా పేగు పనితీరును మెరుగుపరచడానికి, కడుపు నొప్పిని నయం చేయడానికి ప్రభావవంతంగా పనిచేస్తుంది.

బరువు తగ్గడానికి

పెరుగులో కొవ్వు, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి బరువును నియంత్రించడంలో సహాయపడుతాయి. రోజూ పెరుగు తినడం వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది.

Latest Videos

click me!